BTech Student | రేవంత్ సర్కార్ పాలిటెక్నిక్ విద్యను అంధకారంలోకి నెట్టేసేలా తీసుకొచ్చిన జీవో 97ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారని తెలిసిందే. విద్యార్థులంతా రోడ్డెక్కి రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్ బీటెక్ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వమున్నప్పుడు మా భవిష్యత్ కొంచెం మెరుగులో పడ్డది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా జీవితం కిందికి జారుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు కొద్ది గొప్పో జాబ్ అప్లికేషన్లు పెట్టుకోవడానికి అవకాశాలుండే. ఇప్పుడు అది కూడా లేదు.. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్టూడెంట్స్ కోసం ఒక్క పని కూడా చేయలేదు. సీఎం కాకముందు చేస్తా చేస్తా అని వంద చెప్పిండు. కానీ సీఎం అయిన తర్వాత మాకు ఒక్క పని కూడా చేయలేదన్నాడు.
మహా అంటే ఫ్రీ బస్సు.. అది విద్యార్థులకు ఏ రకంగా కూడా ఉపయోగపడటం లేదు. రేవంత్ రెడ్డి చదువుకోలే.. ఇంకొరికి ఎవరినీ కూడా చదువుకోనీయొద్దు అనేదే ఆయన మోటివ్. ఆయనకు చదువు రాదు.. అందుకే ఇంకొకరిని చదువునీయొద్దనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డికి అసలు ముఖ్యమంత్రి లక్షణాలు లేవు. అతనికి దొంగ బుద్ధి ఉంది కాబట్టే అతన్ని దొంగలాగా చూస్తున్నారు. ఒక చిన్న కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి కంటే హుందాగా మాట్లాడతాడని సదరు విద్యార్థి ఎద్దేవా చేశాడు.
రేవంత్ రెడ్డి చదువుకోలేదు కాబట్టి విద్యార్థులు కూడా చదవుకోవద్దు అనుకుంటున్నాడు
రేవంత్ రెడ్డికి అసలు ముఖ్యమంత్రి లక్షణాలు లేవు
అతనికి దొంగ బుద్ధి ఉంది కాబట్టే అతన్ని దొంగ లాగా చూస్తున్నారు
ఒక చిన్న కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి కంటే హుందాగా మాట్లాడతాడు
ఆయన గెలిచిన నాటి నుండి… https://t.co/veO6gEfqsY pic.twitter.com/n93aZDExIV
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2026
Bittu Tabahi | నదిని శుభ్రం చేసిన యువకుడు.. బిట్టు తబాహికి పద్మ ఇవ్వాలన్న సింగర్ చిన్మయి!
న్యూడ్ ఫొటోలతో కాంగ్రెస్ నాయకుడి బెదిరింపులు.. సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
Bigg Boss | బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లకుండానే ఎలిమినేషన్.. క్రిటిక్కి షాకిచ్చిన ఆడియన్స్!