Badi Bata | చిగురుమామిడి, జూన్ 10: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, రేకొండ, ముల్కనూర్ గ్రామాలలో విద్యావాహిని విద్యా చైతన్య రథం ద్వారా ఎంఈఓ పావని, ఉపాధ్యాయులు గ్రామాలలో బడిబాట ప్రచారాన్ని మంగళవారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు మొదలు అంశాలపై వివరించారు.
ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని వివరించారు. ప్రతీ ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా భవాని, హేమలత, సురేష్, బానోతు శారద, శ్రీనివాస్, ఎంఆర్సీ పర్యవేక్షకులు బొడ్డు తిరుపతి, సీఆర్పీలు శ్రీ వాణి, ఆంజనేయులు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ బరిగెల సదానందం, గ్రామస్తులు పాల్గొన్నారు.