Asha Workers | చిగురుమామిడి, మే 20 : దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా చిగురుమామిడి మండలానికి చెందిన ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు ఇవాళ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ఆశా కార్యకర్తల వేతనం పెంచాలని, మూడవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆహార భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ భిక్షాటన కార్యక్రమంలో ఆశా వర్కర్లు మారేళ్ల శ్రీలత, బెజ్జంకి సరోజన, బండారు సరోజన, పుష్ప, అంజలి, కవిత, తార, శ్వేత, సాహిదా బేగం, మంజుల, తిరుమల తదితరులు పాల్గొన్నారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ