Indira Mahila Shakhti | ఓదెల, జూలై 10 : పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలపై కళాజాత ప్రచారాన్ని గురువారం నిర్వహించారు.
ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీలేని రుణాలతోపాటు మహిళలకు ప్రమాద బీమా, కుట్టు మిషన్ కేంద్రాలు, సోలార్ ప్లాంట్స్, పెట్రోల్ పంపులు, ఆర్టీసీ బస్సులు, మార్కెట్ సెంటర్లు, 15 సంవత్సరాలుపైబడిన వారితోపాటు వృద్ధులను, వికలాంగులను మహిళా సంఘాలలో చేర్చుటకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్న తరుణంలో వారిని సంఘ సభ్యులుగా చేర్పించడంపై మహిళా శక్తి ప్రత్యేక కృషి చేస్తుందని కళాజాత ప్రచార బృందాలు ప్రజలకు అవగాహన కల్పించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ప్రభుత్వ కళాజాత ప్రచార బృందాలు మండల కేంద్రం ఓదెలలో ఇందిరా మహిళ శక్తి సంబరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏపీఎం లతా మంగేశ్వరితోపాటు సీసీలు దొడ్డే విజయ, మారెళ్ళ శ్రీనివాస్, మండల సమైక్య కార్యదర్శి అనూష విఓఏలు అనిత, రమ,ప్రణీత, పద్మ, లావణ్య లతోపాటు మహిళా సభ్యులు, ప్రభుత్వ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్