e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home కరీంనగర్ మీ కష్టాల్లో తోడుంటా..

మీ కష్టాల్లో తోడుంటా..

ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా
ఏ రాత్రి పిలిచినా పలుకుతా.. ఆపదొస్తే అండగా నిలుస్తా..
అవకాశం ఇవ్వండి.. ఆశీర్వదించండి..
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విజ్ఞప్తి
సింగాపూర్‌లో ఎమ్మెల్యే సతీశ్‌బాబు,మాజీమంత్రి పెద్దిరెడ్డితో కలిసి విస్తృత ప్రచారం
అడుగడుగునా నీరాజనం

హుజూరాబాద్‌ రూరల్‌/ హుజురాబాద్‌ చౌరస్తా, సెప్టెంబర్‌ 16;కడుపేదరికంలో పెరిగి ప్రజల బాధలు తెలిసిన బిడ్డను. మీ కండ్ల ముందే మెదిలి ఉద్యమబాట పట్టిన మీ గెల్లు సీనును. సీఎం కేసీఆర్‌ దీవెనలతో మీ ముందుకు వచ్చిన. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ కష్టాల్లో తోడుంట. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు పిలిచినా పలుకుతా. ఆపదొస్తే ఆదుకుంట” అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లో ఎమ్మెల్యే సతీశ్‌బాబు, మాజీమంత్రి పెద్దిరెడ్డితో కలిసి గురువారం విస్తృత ప్రచారం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఐదు వేల ఇండ్లు కట్టించి ఇస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు పాటుపడతానని హామీ ఇచ్చారు.

విశ్వకర్మల మేధస్సు గొప్పది..
మీ కష్టాలు, సుఖాల్లో నేను తోడుగా ఉంటా.. మీ కండ్లల్లో మెదిలే వాడిగా, నోట్లో నాలుకలాగా.. మీ వెంటే ఉంటా.. మీ తమ్ముడిగా సేవలందిస్తా. కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించండి. విశ్వకర్మలు చాలా గొప్పవారు. సమాజంలో ఎవరికీ ఏమీ తెలియని, ఇంజినీర్లు లేని సమయంలో పనిముట్లను కనిపెట్టి గొప్ప గొప్ప పనులు చేసింది, సమాజాన్ని ముందుకు నడిపించింది విశ్వకర్మలే. రాజుల చరిత్రలో ప్రణాళికలు వేసి పెద్ద పెద్ద ఆనకట్టలు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించింది విశ్వకర్మలే. వాస్తు ప్రకారం నిర్మించడంలో విశ్వకర్మ మేధస్సు ఎంతో గొప్పది. వచ్చే ఎన్నికలో నన్ను గెలిపిస్తే భవిష్యత్‌లో పేదల కోసం శక్తివంచన లేకుండా పని చేస్తా. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి హుజూరాబాద్‌కు ఏదైనా పరిశ్రమను తెచ్చే ప్రయత్నం చేస్తా.

- Advertisement -

నేను కడు పేదరికంలో పెరిగిన బిడ్డను. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల బాధలు తెలుసు. మీలో ఒకడిగా ఉంటా, ప్రజల కష్టాలు, కన్నీళ్లలో తోడుంటా. ఎప్పుడు పిలిచినా వస్తా.. సమస్యల పరిషారానికి కృషి చేస్తా. ఉద్యమంలో పనిచేసిన. ఎన్నో కేసులు పెట్టినా భయపడకుండా కేసీఆర్‌ వెంట నడిచిన. బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి’ అంటూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ఉద్ఘాటించారు. గురువారం సింగాపూర్‌లో ఎమ్మెల్యే సతీశ్‌బాబు, మాజీమంత్రి పెద్దిరెడ్డితో కలిసి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఎకడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, ఆసరా, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, రైతు బంధు, మిషన్‌ భగీరథ, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలతో రాష్ట్రం అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. ఉచిత నిరంతర విద్యుత్‌ అందిస్తూ, ఎరువుల కొరత లేకుండా చూస్తూ రైతులకు అండగా ఉంటున్నారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వ్యవసాయాన్ని పండుగలా మార్చిన టీఆర్‌ఎస్‌ సర్కారుకు ప్రజలంతా అండగా నిలువాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేసిందేమీ లేదని, గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి సామాన్యులు, నిరుపేదల నడ్డి విరిచిందని మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదని దుయ్యబట్టారు. ఇక్కడ ఎంపీపీ ఇరుమల్ల రాణి, సర్పంచ్‌ మంద మంజుల, టీఆర్‌ఎస్‌ యువ నాయకులు వొడితల ప్రణవ్‌బాబు, సింగిల్‌విండో చైర్మన్లు కౌరు సుగుణాకర్‌రెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, నాయకులు సోమారపు రాజయ్య, కిషన్‌రెడ్డి, బిజిగిరి కుమార్‌, సమ్మిరెడ్డి, చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, హరీశ్‌, నరేశ్‌ తదితరులు ఉన్నారు.

సింగాపూర్‌ ఆలయంలో పూజలు..
సింగాపూర్‌లో ప్రచారానికి వెళ్లే ముందు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి పూజలు చేశారు. వేద పండితులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, మాజీమంత్రి పెద్దిరెడ్డి సైతం గెల్లును ఆశీర్వదించారు.

గెల్లుకు నీరాజనం..
ఉద్యమ బిడ్డ.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు సింగాపూర్‌ జనం నీరాజనం పట్టింది. ఉప ఎన్నికలో భాగంగా గ్రామంలో ప్రచారం నిర్వహించగా, పెద్దఎత్తున మహిళలు, గ్రామ ప్రజలు తరలివచ్చి అడుగడుగునా బ్రహ్మరథం పట్టగా, గులాబీ కండువాలు, గులాబీ జెండాలతో గ్రామమంతా గులాబీమయమైంది. డప్పు చప్పుళ్లు, కోలాట నృత్యాలు, టీఆర్‌ఎస్‌ శ్రేణుల నినాదాలతో హోరెత్తింది. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, మాజీమంత్రి ఇనుగాల పెదిరెడ్డితో కలిసి గెల్లు శ్రీనివాస్‌ వాడవాడలా కలియదిరుగగా, ఎక్కడ చూసినా తమ ఇంటికి వచ్చినా గెల్లుకు మహిళలు బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు. ‘నువ్వే గెలుస్తవ్‌ బిడ్డా’ అంటూ దీవించారు. ప్రచారం సందర్భంగా వందలాది యువతీ, యువకులు స్వచ్ఛందంగా గులాబీ జెండాలతో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ వెంట నడిచారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement