e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home కరీంనగర్ కరోనా కట్టడి, రోగుల సౌకర్యానికి టాస్క్‌ఫోర్స్‌

కరోనా కట్టడి, రోగుల సౌకర్యానికి టాస్క్‌ఫోర్స్‌

కరోనా కట్టడి, రోగుల సౌకర్యానికి టాస్క్‌ఫోర్స్‌

రెండు కమిటీల ఏర్పాటు
నేటి నుంచి రెండు వేలకే సిటీ స్కాన్‌
ఎమ్మార్పీకే రెమ్‌డెసివిర్‌
కొవిడ్‌ ఫ్రీ జిల్లా కోసం సమష్టి కృషి
అధిక చార్జీలు వసూలుచేసే ప్రైవేట్‌ దవాఖానలపై చర్యలు
రెండు వేర్వేరు వాట్సాప్‌ గ్రూపుల ఏర్పాటు
ఏ అవసరం ఉన్నా.. సమస్యను పోస్టుచేయవచ్చు
విలేకరుల సమావేశంలో వెల్లడించిన మంత్రి గంగుల
సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
కొవిడ్‌ హెల్ప్‌ పీఆర్వోల నంబర్లు
టీ సాయిరాజు, ఎం రాజు : 7207117480
ఎండీ రియాజుద్దీన్‌, ఆర్‌ ప్రశాంత్‌ : 8008553139
శ్రీనివాసరెడ్డి, మంత్రి పేషీ : 8639000296

కరీంనగర్‌, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కరీంనగర్‌ జిల్లాలోని అన్ని డయాగ్నోస్టిక్స్‌ సెంటర్లలో శుక్రవారం నుంచి 2 వేలకే సిటీస్కాన్‌ సౌలభ్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కరోనా కట్టడికి గురువారం మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన కరీంనగర్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొవిడ్‌ నియంత్రణతోపాటు రోగులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం.. ఇదే సమయంలో అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్‌ దవాఖానలపై కఠిన చర్యలు తీసుకోవడం, 2వేలకే సిటీస్కాన్‌, ఎమ్మార్పీ ధరలకే రెమ్‌డెసివిర్‌, కరోనా బాధితులు తమ సమస్యలు చెప్పుకోడానికి వీలుగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని సమావేశం తదుపరి ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో మంత్రి వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి వారి సహకా రం డయాగ్నోస్టిక్స్‌ ఎంటర్ల నిర్వాహకులను కోరామని, ఆ మేరకు.. వారు 2 వేలకు సిటీస్కాన్‌ తీసేందుకు అంగీకరించారని తెలిపారు. ఒక వేల స్కాన్‌విత్‌ ఫిల్మ్‌ కావాలంటే అదనంగా 200 చెల్లిస్తే సరిపోతుందన్నారు. శుక్రవారం నుంచి సిటీస్కాన్‌కు 2వేలకు మించి వసూలు చేస్తే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అవస్థలను, ఇబ్బందులను గుర్తించి సహకరించడానికి ముందుకొచ్చిన డయాగ్నోస్టిక్స్‌ సెంటర్‌ నిర్వాహకులకు మంత్రి గంగుల కృతజ్ఞతలు తెలిపారు.
టాస్క్‌ఫోర్స్‌ బృందాలు..
జిల్లాలో కరోనా కట్టడితో పాటు, రోగులకు కావాల్సిన అవసరాలు తీర్చేందుకు, ప్రైవేటు దవాఖానల్లో అధిక చార్జీలకు అడ్డుకట్ట వేసేందుకు టాస్క్‌ ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు మం త్రి తెలిపారు. మొదటి కమిటీలో మంత్రి అధ్యక్షతన, కలెక్టర్‌, పో లీసు కమిషనర్‌, జిల్లా వైద్యాధికారి, రెండో కమిటీలో మంత్రి అధ్యక్షతన జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఐదుగురు పీఆర్వోలు ఉంటారని చెప్పారు. ఇందుకోసం వాట్సాప్‌ గ్రూపును ఏ ర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొవిడ్‌ బాధితులకు సాయం అం దించేందుకు గ్రూప్‌ నంబర్లను నేడు ప్రకటిస్తామని, ఈ గ్రూపు 24 గంటల పాటు పనిచేస్తుందని పేర్కొన్నారు. వీటితోపాటు ప్రభుత్వ, ప్రైవేటు బెడ్స్‌ ఖాళీల వివరాలను రోజూ వెల్లడిస్తామన్నారు.
ఎమ్మార్పీకే రెమ్‌డెసివిర్‌..
రోగులకు ఎమ్మార్పీకే ధరలకే రెమ్‌డెసివిర్‌ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేక విభాగం ద్వారా ఏ దవాఖానకు ఎన్ని రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌, ఇతర అత్యవసర మందులు కేటాయించాం.. ఏ దవాఖానకు ఎంత ఆక్సిజన్‌ పోతుందనేది పర్యవేక్షించడమే కాకుండా.. వాటి ప్రస్తుత స్టాక్‌, ఎవరికి వాడారు వంటి వివరాలతో డాష్‌ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రైవేటులోనూ రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌లకు ఎలాంటి కొరతా లేదని, ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నగరంలోని 31 ప్రైవేట్‌ దవాఖానలకు రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు సరఫరా అవుతున్నాయని, ఆపద సమయంలో ప్రైవేటు దవాఖానల నిర్వాహకులు మానవత్వంతో వ్యవహరించాలన్నా రు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు దవాఖానలపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫీజులు, మందుల, బెడ్ల బ్లాక్‌ దందాలపై టా స్క్‌ ఫోర్స్‌ కమిటీ పర్యవేక్షణ చేస్తుందన్నారు. రోగుల నుంచి వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకొని ఎప్పుటికప్పుడు సంబంధిత అధికారులతో విచారణ చేయించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం సూచించిన ధరలకే చికిత్స అందించాలని కోరామని, ఆ మేరకు వారు అంగీకారం తెలిపారని పేర్కొన్నారు.
కట్టడికి కఠిన నిబంధనలు
కరోనా కట్టడికోసం ప్రస్తుతం లౌక్‌డౌన్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, ప్రజల అవసరాలు, ఇతర విషయాలను దృష్టిలో పె ట్టుకొని ఉదయం నాలుగు గంటల పాటు సడలింపులు ఇచ్చింద ని, అయితే ఆ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కరీంనగర్‌లో 11, 523 ఆక్టివ్‌ కేసులకు 9, 911 మంది హోంఐసొలేషన్లో కోలుకుంటున్నారని, ఇప్పటి వరకు 776 బృందాలతో 2 లక్షల 60 వేల ఇండ్లలో జ్వర సర్వే పూర్తయిందని, లక్షణాలున్న దాదాపు ఆరు వేల మందికి కిట్లు అం దించి అవసరమైన మందులతో చికిత్స అందిస్తున్నామని, ఇప్పటికే 2,18,463 మందికి వాక్సినేషన్‌ పూర్తయిందని మంత్రి తెలిపారు. కరీంనగర్‌లో ఇండోనేషియా కేసులు పెరిగిన సమయంలో ప్రతి ప్రజాప్రతినిధి ఎలా పని చేశారో అదేవిధంగా ప్రస్తుతం మంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేలు, మేయర్‌, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. సమష్టి కృషితో జిల్లాను కొవిడ్‌ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు కలిసి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమా వేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకే రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ సునీల్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా కట్టడి, రోగుల సౌకర్యానికి టాస్క్‌ఫోర్స్‌

ట్రెండింగ్‌

Advertisement