మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 17 : ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన గూడ అశోక్‌రెడ్డి సార్ అంటే తనకెంతో గౌరవమని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మానకొండూర్ మండలం దేవంపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (సీవోఈ)లో లెక్చరర్‌గా పని చేస్తున్న అశోక్‌రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యమానికి బాల్క సుమన్ హాజరై, తన గురువు అశోక్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. పెంబట్ల స్కూల్, రుక్మాపూర్ కాలేజీలో తనకు పాఠాలు బోధించారని, తన భవిష్యత్‌కు మార్గదర్శిలా నిలిచారని, ఆ రోజులు మరిచిపోలేనివని చెప్పారు. అనంతరం అశోక్‌రెడ్డి దంపతులను సత్కరించారు. తర్వాత బాల్క సుమన్‌ను ప్రిన్సిపాల్ గోలి జగన్నాథం, అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు రేణికుంట బాబు, తదితరులు పాల్గొన్నారు.