న్యూయార్క్, సెప్టెంబర్ 17 : అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు వడ్డీరేట్లను తగ్గించింది. 9 నెలల తర్వాత అంచనాలకు తగ్గట్టుగానే బుధవారం కీలక వడ్డీరేటుకు పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) కోత పెట్టింది. ఈ ఏడాదిలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, తాజా నిర్ణయంతో ప్రస్తుతం వడ్డీరేట్ల శ్రేణి 4-4.25 శాతంగా ఉన్నది.
ఇక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నిసార్లు వడ్డీరేట్లను తగ్గించాలని సూచించినా ద్రవ్యోల్బణం, ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఫెడ్ మాత్రం పట్టించుకోలేదు. అయితే ఈసారి మెజారిటీ సభ్యులు తగ్గింపునకే ఓటేశారు. ఇదిలావుంటే ఈ ఏడాది మరో రెండుసార్లు వడ్డీరేట్లను ఫెడ్ తగ్గించే వీలుందన్న అంచనాలున్నాయి.