state-level boxing competitions | ఓదెల, సెప్టెంబర్ 17 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో కనగర్తి క్రీడాకారులు పంచుల వర్షం తో 3 గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారు.
42 కేజీల విభాగంలో దామ రిషి చరణీ, 60 కేజీల విభాగంలో దొడ్డి కీర్తన, 64 కేజీల విభాగం లో వేల్పుల అక్షిత ముగ్గురు విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించారు. రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు, కరీంనగర్ బాక్సింగ్ అకాడమీ క్రీడాకారులను సైతం పంచులతో బెంబేలెత్తించారు. పథకాలు సాధించిన విద్యార్థులను, కోచ్ పీడీ విష్ణు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవో రమేష్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అభినందించారు.