e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home కామారెడ్డి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
  • ధాన్యాన్ని జాలీ పట్టాలి: డీసీవో
  • భౌతికదూరాన్ని పాటించాలి: ఆర్డీవో
  • కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

లింగంపేట, ఏప్రిల్‌ 27: కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని కచ్చితంగా జాలీ పట్టాలని జిల్లా సహకార సంఘం అధికారిణి వసంత సూచించారు. మండలంలోని భవానీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డీసీవో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. యాసంగిలో రైతులు సాగు చేసిన ధాన్యంలో తాలుగింజలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో రైస్‌మిల్‌ యజమానులు ధాన్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారన్నారు. జాలీ పట్టిన తర్వాత ధాన్యం తీసుకోవడానికి నిరాకరిస్తే రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమె వెంట సహకార సంఘం చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, మండల వ్యవసాయశాఖ అధికారి సాయిరమేశ్‌ గౌడ్‌, సీఈవో సందీప్‌, ఎంపీటీసీ సభ్యుడు సురేందర్‌, విండో డైరెక్టర్‌ సుజాత తదితరులు ఉన్నారు.

భౌతికదూరాన్ని పాటించాలి..
ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 27: కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు భౌతికదూరం పాటించాలని ఆర్డీవో శ్రీను అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని భిక్నూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. రైతులకు ఇచ్చిన టోకెన్ల ప్రకారం ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ ఏగుల నర్సింహులు, తహసీల్దార్‌ స్వామి, సొసైటీ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌గౌడ్‌, డైరెక్టర్లు సుఖేందర్‌రెడ్డి, గోపి, మర్రి ప్రకాశ్‌, సీఈవో విశ్వనాథం, రైతులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చైర్మన్లు
నిజాంసాగర్‌/బాన్సువాడ రూరల్‌/ దోమకొండ/ మాచారెడ్డి, ఏప్రిల్‌27: నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట గ్రామంలో సొసైటీ చైర్మన్‌ నర్సింహారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సొసైటీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో తొమ్మిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నాయకులు సత్యనారాయణ, రమేశ్‌, రాములు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. బాన్సువాడ మండలంలోని బుడ్మి విండో ఆధ్వర్యంలో కొయ్యగుట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్‌ పిట్ల శ్రీధర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, సీఈవో కృష్ణమయ్య తదితరులు పాల్గొన్నారు. దోమకొండ మండలంలోని సంగమేశ్వర్‌, అంచనూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను విండో చైర్మన్‌ నాగరాజురెడ్డి, జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ కోట సదానంద, సర్పంచులు బురాని సమత స్వామిగౌడ్‌, కరికె సుమలత మురళి, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, నాయకులు నర్సయ్య, సుధాకర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి మండలంలోని లక్ష్మీరావులపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్‌ లక్ష్మాగౌడ్‌ ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫరీద్‌పేటలో ఐడీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని వైస్‌ ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి ప్రారంభించగా.. సర్పంచులు నవీన్‌, భాగ్యమ్మ, ఉపర్సంచ్‌ నవీన్‌రెడ్డి, ఏవో రాజు ఎపాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement