నాగిరెడ్డిపేట్/ లింగంపేట/ పిట్లం/ తాడ్వాయి/ విద్యానగర్/కామారెడ్డి రూరల్/గాంధారి, ఏప్రిల్ 16 : జిల్లావ్యాప్తంగా వాటర్ డే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని మొక్కలకు అధికారులు, ప్రజాప్రతినిధులు నీరుపట్టారు.గాంధారి మండలం మేడిపల్లి గ్రామంలోని అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు కలెక్టర్ శరత్ నీరుపట్టారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని స్థాని అధికారులకు సూచించారు. గౌరారంలో ఏపీడీ సుధీర్‌తో పాటు డీపీఎం రమేశ్‌బాబు మొక్కలకు నీరుపోశారు. వారి వెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయ్కుమార్, సర్పంచులు నారాయణ, అంజయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ శంకర్, పంచాయతీ కార్యదర్శలు సంతోష్, సంజీవ్ ఉన్నారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని మెల్లకుంట తండా నుంచి పోచారం రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు, నర్సరీలను జడ్పీసీఈవో సాయాగౌడ్ పరిశీలించారు. అనంతరం మొక్కలకు నీరు పట్టారు. ఆయన వెంట జడ్పీటీసీ సభ్యుడు మనోహర్‌రెడ్డి, ఎంపీపీ రాజదాస్, ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ అరుణ, ఈసీ మధు ఉన్నారు. నాగిరెడ్డిపేట్లోని వైకుంఠధామంలో, బంజారా తండాలో ఎంపీవో శ్రీనివాస్ మొక్కలకు నీరుపోశారు. లింగంపేట మండల పరిషత్ కార్యాలయంలోని మొక్కలకు ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి నీరుపట్టారు. కామారెడ్డి-ఎల్లారెడ్డి రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు పంచాయతీ అధికారి ప్రభాకరాచారి, ఈవో రవీందర్రావు నీరు పోశారు.
పిట్లం మండలం తిమ్మానగర్‌లో రైతువేదిక వద్ద ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ అనిత మొక్కలకు నీరుపట్టారు. చిన్నకొడప్గల్లో మండల ప్రత్యేక అధికారి జగన్నాథాచారి మొక్కలకు నీరుపట్టారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటేశ్వర్, ఎంపీవో బ్రహ్మం, పంచాయతీ కార్యదర్శి బలరాం ఉన్నారు. తాడ్వాయి మండలపరిధిలోని పలు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు మొక్కలకు నీరు పోశారు. కామారెడ్డి కొత్తబస్టాండ్ సమీపంలో ఉన్న మొక్కలకు బల్దియా చైర్పర్సన్ నిట్టు జాహ్నవి నీళ్లుపోశారు. ఆమెవెంట శానిటరీ ఇన్స్పెక్టర్ పర్వేజ్, వాటర్ ఫిల్టర్‌బెడ్ అధికారి శ్యామ్ ఉన్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో సర్పంచ్ మంజుల, కార్యదర్శి సౌమ్య, రాఘవపూర్‌లో సాగర్‌గౌడ్, గర్గుల్‌లో సర్పంచ్ చింతల రవితేజగౌడ్, కార్యదర్శి సాగర్ మొక్కలకు నీళ్లు పోశారు.
ఇవీ కూడా చదవండీ…
కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
విస్తృతంగా కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్