e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home జయశంకర్ రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

  • రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి

బచ్చన్నపేట, జూన్‌ 15 : సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి అన్నారు. వానకాలం రైతు బంధు డబ్బులు మంగళవారం రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని రైతు వేదికల వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బచ్చన్నపేటలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం అనంతరం ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో రైతులను పట్టించుకున్న నాథుడే లేడన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. సాగుకు ఉచితంగా కరంటుతోపాటు రైతులకు రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. అంతేకాకుండా పండించిన ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సర్పంచ్‌ వడ్డేపల్లి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పూర్ణచందర్‌, మండల కోఆప్షన్‌ సభ్యులు షబ్బీర్‌, ఎంపీటీసీ వేణుగోపాల్‌, నాయకులు నరేందర్‌, జావెద్‌, సిద్ధారెడ్డి, ఫిరోజ్‌, కిష్టయ్య, ప్రతాపరెడ్డి, సిద్ధిరాంరెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.

సిరిపురంలో..
లింగాలఘనపురం : మండలంలోని సిరిపురంలో రైతులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. రైతు బంధు పథకం నిధులను విడుదల చేసినందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బస్వగాని శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌ మర్రి లక్ష్మి, నాయకులు దామోదర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఉపేందర్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

- Advertisement -

దేవరుప్పులలో..
దేవరుప్పుల : మండల కేంద్రం, కడవెండి, పెదమడూరు, నీర్మాల, కోలుకొండలో రైతులు సంబురాలు జరుపుకున్నారు. దేవరుప్పుల రైతు వేదిక వద్ద రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ ఈదునూరి నర్సింహరెడ్డి, గ్రామకోఆర్డినేటర్‌ కారుపోతుల భిక్షపతి, కడవెండిలో గ్రామ కోఆర్డినేటర్‌ పోతిరెడ్డి లీనారెడ్డి, కోలుకొండలో గ్రామకోఆర్డినేటర్‌ కోతి పద్మ, పెదమడూరులో రైతు బంధు గ్రామకోఆర్డినేటర్‌ ఆకవరం పెద్దారెడ్డి, నీర్మాలలో రైతు కోఆర్డినేటర్‌ కాసర్ల దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు నెల్లుట్ల భారతి, కోనేటి వెంకన్న, పంజాల రాములు, రాదారపు శంకర్‌, దాసగాని భిక్షపతి, లేగ సోమారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, నాయకులు పల్లా సుందరాంరెడ్డి, బస్వ మల్లేశ్‌, కొల్లూరు సోమయ్య, చింత రవి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నక్క రమేశ్‌, డైరెక్టర్లు కొత్త జలేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు జోగు సోమనర్సయ్య, తాటిపల్లి మహేశ్‌, జోగేశ్వర్‌, యాకస్వామి పాల్గొన్నారు.

రైతుబంధు దేశానికి ఆదర్శం
తరిగొప్పుల : రైతుబందు పథకం దేశానికి ఆదర్శమని రైతుబంధు సమితి మండల కోఆర్టినేటర్‌ భూక్య జూంలాల్‌నాయక్‌ అన్నారు. జుంలాల్‌ నాయక్‌ ఆధ్వర్యంలో నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు పెట్టుబడి సాయం అంజేయడం హర్షణీయమన్నారు. సర్పంచ్‌ దామెర ప్రభుదాస్‌, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు ముద్దసాని వెంకట్‌రెడ్డి, జొన్నగోని సుదర్శన్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పింగిళి జగన్‌మోహన్‌రెడ్డి, చిలువేరు లింగం, అంకం రాజారాం, తాళ్లపల్లి పోషయ్య, మినుకూరి జయపాల్‌రెడ్డి, వంగ రామరాజు, చెన్నూరి సంజీవ, సుంకరి రాజయ్య పాల్గొన్నారు.

రైతువేదికల వద్ద పాలాభిషేకం
పాలకుర్తి రూరల్‌ : సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు అన్నారు. రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ వీరమనేని యాకాంతారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌తో కలిసి సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు మండలంలోని రైతు వేదికల వద్ద పాలాభిషేకం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ముస్కు నిర్మలాచంద్రబాబు, కడుదుల కర్ణాకర్‌రెడ్డి, పులి ప్రభాకర్‌, నల్ల మహేందర్‌, గుగులోతు యాదలక్ష్మి, మారుజోడు సంతోష్‌కుమార్‌, వేల్పుల దేవరాజు, అనుముల ఎల్లారెడ్డి, కొంగరి ఐలోని, ఏఈవోలు బిట్ల సరిత, బోడ శ్రావణి, చింతం సరిత కుమారి,ముత్తినేని వెంకటేశ్‌ రైతులు పాల్గొన్నారు.

కొడకండ్లలో..
కొడకండ్ల : రైతులకు రైతు బంధు అందజేసిన సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పేరం రాము అన్నారు. మండల కేంద్రం, రామవరం క్లస్టర్‌, ఏడునూతుల క్లస్టర్‌ రైతు వేదికల్లో సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కరోనా కష్ట కాలంలో కూడా రైతుబంధు డబ్బులు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు సిందే రామోజీ, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ దీకొండ వెంకటేశ్వర్‌రావు, మాజీ జీసీసీ చైర్మన్‌ గాంధీనాయక్‌, ఎంపీటీసీ అందె యాకయ్య, సర్పంచ్‌ మధుసూదన్‌, టీఆర్‌ఎస్‌ కొడకండ్ల పట్టణ అధ్యాక్షుడు అమరేందర్‌ రెడ్డి, సొసైటీ వైస్‌ చైర్మెన్‌ మేటి సోమరాములు, నాయకులు వెంకటనారాయణ, వీరారెడ్డి నారాయణరెడ్డి, కుమారస్వామి గౌడ్‌, ఆసిఫ్‌, దేశగాని సతీశ్‌, తాళ్ల శోభన్‌, బోయిని రమేశ్‌ పాల్గొన్నారు.

సిద్ధెంకిలో..
జనగామ రూరల్‌ : సిద్ధెంకి గ్రామంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో పెట్టుబడికి డబ్బులు అందిస్తున్న సీఎం కేసీఆర్‌ను రైతులు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని తెలిపారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement