రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం : డీఎస్పీ

కాళేశ్వరం, డిసెంబర్ 25 : రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే వ్యక్తులపై ఉక్కుపాదం మోపనున్నట్లు డీఎస్పీ బోనాల కిషన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ అక్రమార్కులపై అవసరమైతే పీడీ యాక్టు అమలు చేసేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న బియ్యాన్ని కొందరు డీలర్లు పక్కదారి పట్టిస్తూ పొరుగు రాష్ర్టాలకు తరలిస్తున్నారని అన్నారు. అధిక ధరలకు అమ్ముతూ డబ్బు సంపాదించేందు కు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారన్నారు. కాటారం సబ్ డివిజనల్ పరిధిలోని పోలీస్ యంత్రాంగం ఉన్నతాధికారుల సూచనల మేరకు అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా మొత్తం 44 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 1192. 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 36 వాహనాలను సీజ్ చేసి 77 మంది నిందితులను అరెస్టు చేసిన ట్లు తెలిపారు. ఇక నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేది ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చేలా పోస్టులు చేస్తున్నారని, అలాంటి వారిపై నిఘాను ఏర్పాటు చేశామన్నారు. అసత్యపు ప్రచారాలను పోస్టు చేసే వ్యక్తులతోపాటు మొదటగా అడ్మిన్లపైనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
- చమురు షాక్: ఏడేండ్లలో 459% పెరుగుదల
- ఓలా ఫ్యూచర్ మొబిలిటీ.. 2 సెకన్లకో ఈ-స్కూటర్
- హైదరాబాద్లో కాల్పుల కలకలం
- రావణ వాహనంపై ఊరేగిన శ్రీశైలేషుడు..
- స్కూల్ గోడ కూలి.. ఆరుగురు కూలీలు మృతి
- హెబ్బా పటేల్ తలను ‘తెలిసిన వాళ్లు’ ఏదో చేసారబ్బా..!
- ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే..!
- మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా కేసులు.. 22 మరణాలు
- పారితోషికం భారీగా పెంచిన నాని!
- నల్లగొండకు చేరిన ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు