హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటేస్తానికి సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో ఉదయం 5.30 నుంచి సిటీ బస్సులు, మెట్రో రైళ్లు (Hyderabad Metro) ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, బీహెచ్ఈఎల్ వెళ్లేవారు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు.
దీంతో హైదరాబాద్ మెట్రో రద్దీగా మారింది. రైలు రావడమే ఆలస్యం బోగీలన్ని నిండిపోతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అరగంట ముందుగానే సర్వీసులను ప్రారంభించారు. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లే మెట్రోలో రద్దీ పెరిగింది. దీంతో ఎక్కువ ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు.