Hyderabad | ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా నగర ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా గతేడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటే పలు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పడిపోయింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన ఓటింగ్‌తో పోల్చితే పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీగా పోలింగ్ శాతం పడిపోయింది. ఈసారి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, సిటీలో ఓటు హక్కు ఉన్నా… తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కోసం సొంతూళ్లకు వెళ్లిపోవడంతోనే ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడానికి కారణాలుగా పేర్కొంటున్నారు.
అదే విధంగా వరుసగా వచ్చిన వీకెండ్‌తో కూడా ఓటింగ్‌పై ప్రభావితం చూపిందని చెబుతున్నారు. ఇక గ్రేటర్లో ఐటీ ఉద్యోగుల ప్రభావం ఎక్కువగా ఉండే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాల్లోనూ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఓటు హక్కు వినియోగించిన వారి సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. ఈ మాత్రం పోలింగ్ నమోదు కావడానికి కొంత వాతావరణం కూడా సహకరించినట్లు చెబుతున్నారు.

లేదంటే భారీ ఎండలకు గ్రేటర్ ఓటర్లు బయట అడుగు పెట్టే పరిస్థితి ఉండేది కాదని, ఉదయం నుంచి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కాస్తా ఓటర్లు ఊరట చెందే విధంగా పలు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం నమోదైంది. ఎప్పటిలాగే ఓల్డ్ సిటీలోని పలు నియోజకవర్గాల్లో దారుణంగా ఓటింగ్ శాతం నమోదైంది. బహదూర్‌పుర నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 45.08 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా, ఈసారి 34.19 శాతం మందే ఓటేశారు. ఇక దేశంలోనే అతి పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలోనూ ఆశించిన స్థాయిలో పోలింగ్ కాలేదు.


Hyd 1