e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, November 30, 2021
Home జనగాం బీజేపీ, కాంగ్రెస్‌వి పిచ్చి మాటలు

బీజేపీ, కాంగ్రెస్‌వి పిచ్చి మాటలు

ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తాం
యాసంగిపై స్పష్టత ఇవ్వని కేంద్రం
ఎంఎస్‌పీ, విద్యుత్‌ చట్టాలను రద్దు చేయాలి.. రేవంత్‌రెడ్డీ ఢిల్లీలో కొట్లాడు
బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి రైతులు కాదు
విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజం

హనుమకొండ, నవంబర్‌ 24 : ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి హనుమకొండ రాంనగర్‌లోని ఆయన నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. వా నకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్య పు గింజను కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాసంగి ధాన్యం విషయంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని పేర్కొన్నా రు. ఏ రకమైన ధాన్యం ఎంత మేరకు కొనుగోలు చేస్తారో కేంద్రం స్పష్టం చేయాలని ఆ యన డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎంపీలకు ఢిల్లీలో అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా జాప్యం చేశారంటే తె లంగాణ ప్రజలను అవమాన పరిచినట్లేనని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనమని చెబుతుంటే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు వరి వేయాలని అవగాహన లేకుండా మాట్లాడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి రైతులు కారని, వారికి రైతులు సమస్యలు తెలియవని అన్నారు. కేంద్రం నుంచి హామీ రాకున్నా, ఎంత నష్టం వచ్చినా రైతులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ వానకాలం ధాన్యం కొనుగోలు చేస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ఉన్నచోట ఒక విధం గా, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మరో విధంగా, తెలంగాణలో ఇంకో విధంగా మాట్లాడడం శోచనీయమన్నారు. రైతు వ్యతిరేక చట్టాల ను తీసుకొచ్చినందుకు క్షమించాలని ప్రధాన మంత్రి కోరినా బీజేపీ నాయకులు సిగ్గు లే కుండా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్ర హం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్నదాతల పోరాట ఫలితంగా ఇప్పటికే మూడు న ల్ల చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన పీఎం నరేంద్రమోదీ.. ఎంఎస్‌పీ, విద్యుత్‌ చట్టాలను సైతం విత్‌ డ్రా చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కులను కాలరాస్తున్నదని మంత్రి తెలిపారు. రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఢిల్లీలో సత్తా చాటాలని సవాల్‌ విసిరారు. నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని పోరాడి అ మరులైన 700 మందికిపైగా రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించడాన్ని అవహేళన చేస్తున్నారన్నారు. ఒక్కో రైతు కుంటుంబానికి రూ.25లక్షల చొప్పున వెంటనే ఆర్థిక సాయం అందజేయాలని, ఉద్యమంలో రై తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
విభజన హామీలు నెరవేర్చాలి..
రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న కృష్ణా జలాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, వానకాలంలో తెలంగాణలో పండించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని, యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని పంట వేయక ముందే రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. భవిష్యత్‌లో వానకాలం, యాసంగిలో ఎంత ధా న్యం కొనుగోలు చేస్తారో ముందే ప్రకటిస్తే రాష్ట్రంలో ఏ పంటలు వేయాలో రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉం టుందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ పాలనలోనే రైతులు చనిపోయారని స్పష్టత లేకుండా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మూర్ఖత్వంగా మాట్లాడటం మానుకోవాలని మంత్రి హితవు పలికారు.
రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పోరాడు..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫకీర్‌ మా టలు మానుకోవాలని మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు హితవు పలికారు. రైతులకు ధై ర్యం చెప్పు, చాతననైతే ఢిల్లీ స్థాయిలో పో రాటం చేయి అని సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులకు ఇ బ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కనీసం 20 శాతం ధాన్యం కూడా కొనడం లేదని, దొంగ చాటున ఏటూనాగారం, వరంగల్‌కు తీసుకొచ్చి ఇక్కడి రైతుల పేరున అమ్ముకుంటున్నారని తెలిపారు.
కేంద్రానిది రెండు నాలుకల ధోరణి
కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టత ఇ వ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. నదీ జ లాల సమస్యపై కాలయాపనతో రాష్ర్టానికి నష్టం వాటిల్లుతుందన్నారు. అమరులై రైతులకు సాయం చేస్తుంటే బీజేపీ నాయకులు అవహేళన చేయడం మంచి పద్ధతి కాదన్నా రు. సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్‌తో రెచ్చగొడుతున్నారనడం డీకే అరుణకు తగదని, బీ జేపీ నాయకులు మతం పేరుతో రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement