శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 29, 2020 , 00:54:47

కడవెండిలో తిరుకుటుంబం పండుగ

కడవెండిలో తిరుకుటుంబం పండుగ

దేవరుప్పుల, డిసెంబర్‌ 28 : మండలంలోని కడవెండిలో తిరుకుటుంబం చర్చి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కడవెండి గ్రామానికి 112 ఏళ్ల క్రితం వలస వచ్చిన క్రైస్తవ కుటుంబాలు ఇక్కడే చర్చి నిర్మించి స్థిరపడ్డారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్‌ అనంతరం గ్రామంలో చర్చి నిర్మాణ వార్షికోత్సవం నిర్వహిస్తుండగా దీనిని తిరుకుటుంబం పండుగగా  పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుకుటుంబం అధ్యక్షుడు పోతిరెడ్డి జార్జిరెడ్డి ఆధ్వర్యంలో చర్చిలో వేడుకలు నిర్వహించగా క్రైస్తవ కుటుంబాలు పాల్గొన్నారు. ఫాదర్‌ జాన్‌ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్‌ సహాయరాజ్‌, మాధ్యూస్‌, శాంతిరెడ్డి, కిరణ్‌రెడ్డి, ఫ్రావిన్స్‌రెడ్డి, ఫాదర్‌ అంథోని స్వామి తదితరులు ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామంలోని అన్ని క్రైస్తవ కుటుంబాల ఇళ్లకు బంధువులు తరలిరాగా విందు భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పోతిరెడ్డి బెత్లినారెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్‌ లీనారెడ్డి, తిరుకుటుంబం కమిటీ సభ్యులు అంజిరెడ్డి, బాల్‌శౌరిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి,  రాజు, రఫేల్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు సుందరరాంరెడ్డి, బస్వ మల్లేష్‌, ఈదునూరి నర్సింహారెడ్డి, కొల్లూరు సోమయ్య, చింత రవి, రాంసింగ్‌, నక్క రమేశ్‌, కృష్ణమూర్తి, తాటిపల్లి మహేశ్‌, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo