హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ-ఆస్కీ)తో టీ-హబ్ జత కట్టింది. ఈ క్రమంలోనే వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నైపుణ్యాలను స్టార్టప్ వ్యవస్థాపకులకు భోదించేందుకు ‘ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్’ పేరుతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆసక్తిగలవారు టీ-హబ్‌ను సంప్రదించాలని టీ-హబ్ సీఈవో రావు కోరారు.
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ బ్రిడ్జ్ పేరుతో టీ-హబ్ ఓ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆసక్తిగలవారు (https://bit.ly/3OFAu2o) లింకు ద్వారా సంప్రదించవచ్చు.