ముంబై, మే 10: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఆర్ లక్ష్మీకాంత రావును నియమించింది. అంతకుముందు ఈయన రెగ్యులేషన్ శాఖ ఇంఛార్జ్ సీజీఎంగా పనిచేశారు. కాగా, ఈడీగా డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, సమాచార శాఖ, తదితర విభాగాలను చూసుకోనున్నారు.