మంగళవారం 02 మార్చి 2021
Jagityal - Jan 25, 2021 , 02:29:12

ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం

ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం

  • చిన్నారులతో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
  • కిశోర బాలికలకు ఆరోగ్య సలహాలు

జగిత్యాల, జనవరి 24: జాతీయ బాలికా దినోత్సవాన్ని ఆదివారం స్థానిక బాలసదనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి డాక్టర్‌ నరేశ్‌, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీశ్‌ బాలసదనంలోని చిన్నారులతో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. బాలికల తల్లిదండ్రులు బేటీ బచావో.. బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐసీడీఎస్‌, బాలసదన్‌ అధికారులు పాల్గొన్నారు. 

కథలాపూర్‌, జనవరి 24: చింతకుంటలో కిశోర బాలికలతో కోరుట్ల ఉమెన్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ చైర్‌పర్సన్‌ వేముల అరుణ సమావేశం నిర్వహించారు. కిశోర బాలికలు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. పలువురు బాలికలకు దుప్పట్లు, పండ్లు, హైజిన్‌ కిట్లు, విటమిన్‌ మాత్రలు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అనురాధ, ప్రతినిధులు బోగ శ్రీలత, విజయశ్రీ, జ్యోత్స్న, ప్రియాంక, శృతి, శ్రీలత, జడ్పీటీసీ నాగం భూమయ్య, సర్పంచ్‌ భైర హేమలత, ఎంపీటీసీ బొడ్డు బాలు, ఉపసర్పంచ్‌ లోక నర్సారెడ్డి, ఏఎన్‌ఎం గంగనర్సు, ఆశ కార్యకర్త సంగీత, నాయకులు మల్లేశ్‌యాదవ్‌, కృష్ణ తదితరులున్నారు. 

VIDEOS

logo