మొయినాబాద్, మే 10 : బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాయని బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీసీ సంఘాల నేతలు, నాయకులతో కలిసి మాట్లాడారు.
జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభ్యున్నతికి కృషి చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌ను బీసీలందరూ సంఘటితమై భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అనంతరెడ్డి, మండల ప్రధానకార్యదర్శి నర్సింహాగౌడ్, ఉపాధ్యక్షుడు జయవంత్, నాయకులు పాల్గొన్నారు.