Donald Trump | త్వరలో రష్యా అధ్యక్షుడితో భేటీ.. జెలెన్స్కీకి డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం..!
Donald Trump | రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15న అమెరికా (USA) లోని అలాస్కాలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) తో భేటీ కానున్నారు.
Donald Trump : రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15న అమెరికా (USA) లోని అలాస్కాలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) తో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) ని కూడా ఆహ్వానించడానికి ట్రంప్ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వైట్‌హౌస్ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి అలాస్కాలో పుతిన్, జెలెన్స్కీతో త్రైపాక్షిక భేటీ నిర్వహించాలని ముందే ట్రంప్ భావించారు. ఇటీవల అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాస్కో పర్యటన సమయంలోనూ ఇదే విషయాన్ని ప్రతిపాదించారు. దీనిపై క్రెమ్లిన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తొలుత పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీ జరిపి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించాలని భావించారు. ఈ నేపథ్యంలో భేటీకి జెలెన్స్కీని ఆహ్వానించడంపై ట్రంప్ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.
శాంతి చర్చల్లో కీవ్‌ను కూడా భాగం చేయాలని యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలాండ్, ఫిన్లాండ్ వంటి యూరోపియన్ దేశాలు ఇప్పటికే అగ్రరాజ్యానికి విజ్ఞప్తి చేయడం కూడా ట్రంప్ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.
Read More >>
వాళ్లు ప్రతి ఒక్కరికీ తామే బాస్‌లు అనుకుంటున్నారు.. అమెరికాపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ ఫైర్
భర్తతో గొడవ.. ముగ్గురు పిల్లలను ఒంటికి కట్టుకుని కాలువలో దూకిన మహిళ
చాట్‌జీపీటీని నమ్మి.. ఆస్పత్రి పాలై.. కొంపముంచిన డైట్ సలహా
జార్జియాలోని ఓ ఇంటిపై రాలిపడిన పురాతన ఉల్క.. దాని పరిమాణం ఎంతంటే..!
కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంతో ప్రధాని మోదీ మెట్రో రైడ్
కవ్వించి.. హోటల్‌కు రప్పించి! నగ్నవీడియోలతో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న మోసగాళ్లు..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

