e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home News ఉన్న‌ట్టుండి సూర్యుడు మాయ‌మైపోతే ఎలా? భూమిపై మ‌నుషులు ఏమ‌వుతారు?

ఉన్న‌ట్టుండి సూర్యుడు మాయ‌మైపోతే ఎలా? భూమిపై మ‌నుషులు ఏమ‌వుతారు?

What will happen after the sun dies | భూమిపై సకల జీవరాశుల మనుగడకు సూర్యరశ్మి ఆధారభూతంగా నిలుస్తున్నది. గ్రహాల గమనాన్ని నియంత్రించే కేంద్రకంగానూ సూర్యగోళం పాత్ర ఎంతో ప్రధానమైనది. ఇలాంటి సంక్లిష్ట చర్యల్లో కీలకంగా ఉన్న సూర్యుడు ఉన్నట్టుండి ప్రకాశించే గుణాన్ని కోల్పోతే? భూమి మీద జీవరాశులు ఏమవుతాయి? సౌరకుటుంబంలో గ్రహాల పరిస్థితి ఏమిటి? దీనికి ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టాస్మెనియా పరిశోధకులు తాజాగా సమాధానాలు చెప్పారు.

What will happen after the sun dies
What will happen after the sun dies

మిగిలేది ఆ ఒక్క గ్రహమే!

సూర్యుడు ఉన్నట్టుండి మృత నక్షత్రంగా మారిపోతే సౌరకుటుంబంలో అన్ని గ్రహాలు నిర్జీవంగా మారి.. నాశనమవుతాయి. అయితే బృహస్పతిపై ఈ ప్రభావం ఉండబోదు. సూర్యుడి నుంచి ఆ గ్రహానికి ఉన్న సగటు దూరం, అక్కడి వాతావరణం, నేల స్వభావం, గురుత్వాకర్షణ, భ్రమణ-పరిభ్రమణ వేగాలు దీనిపై ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తెలిపారు.

భూమి పరిస్థితి ఏమిటి?

- Advertisement -

సూర్యుడు లేకపోతే భూమి చీకటిమయం అవుతుంది. కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం ఏర్పడి చెట్లు, మనుషులు, జీవజాలమంతా నశిస్తుంది. ఉష్ణోగ్రతలు మైనస్‌ వేల డిగ్రీల సెంటీగ్రేడ్‌ కిందకు వెళ్తాయి. భూమి గురుత్వాకర్షణశక్తి, భ్రమణ వేగంలో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే వచ్చే 500 కోట్ల ఏండ్లవరకూ సూర్యుడు అంతరించే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఎలా చెప్పగలిగారు?

భూమికి 6,500 కాంతిసంవత్సరాల దూరంలోని ఓ గ్రహాల వ్యవస్థను పరిశీలించి పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. ఆ వ్యవస్థ మన సౌరకుటుంబానికి దగ్గరి పోలికలను కలిగి ఉన్నది. అక్కడి కేంద్రకంలోని నక్షత్రం క్రమంగా నిర్జీవమవుతుండటంతో గ్రహాలన్నీ చెల్లాచెదురుగా విసరగొట్టబడుతున్నాయి. అయితే, ‘ఎంవోఏ-2010-బీఎల్జీ-477-ఎల్బీ’ అనే గ్రహంపై ఈ పరిణామాలు ఎంత మాత్రం ప్రభావం చూపట్లేదు. ఆ గ్రహం దాదాపుగా మన బృహస్పతి లక్షణాలనే కలిగి ఉండటంతో పరిశోధకులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

సుదూరం నుంచి అంతుచిక్కని రేడియో తరంగాలు

Oldest toilet : జెరూసలెంలో 2,700 ఏండ్ల క్రితం టాయిలెట్‌ లభ్యం

అబ్ర‌హం లింక‌న్ గ‌డ్డం పెంచ‌డం వెనుక ఉన్న క‌థేంటో తెలుసా !

Bullettu bandi | భార‌త్‌లో బుల్లెట్ బండిని మొదటిసారి వాడింది ఎవరు? ఆ మ‌ధ్య‌కాలంలో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ ఎందుకు క‌నుమ‌రుగైంది?

ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?

myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జ‌న‌నేంద్రియాలు.. ఆమె పుట్టుక‌ ఇప్ప‌టికీ మిస్ట‌రీనే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement