Donald Trump | రష్యా ఆయిల్ కొనుగోలు కారణం చూపి న్యూఢిల్లీపై యూఎస్ భారీ సుంకాల (tariff) విధింపుతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు (US-India ties) దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే అవి ఏకపక్షంగా ఉన్నాయని.. కానీ తాను దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పరిస్థితులు మారిపోయాయని చెప్పుకొచ్చారు.
ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘మేము భారత్‌తో కలిసే ఉన్నాము. ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అయితే, అవి ఏకపక్షంగా ఉన్నాయి. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పరిస్థితులు మారిపోయాయి. భారత్ మా నుంచి అధిక సుంకాలను వసూలు చేస్తోంది. అవి దాదాపు ప్రపంచంలోనే అత్యధికం. మేము భారత్‌తో పెద్దగా వ్యాపారం చేయడం లేదు. కానీ, వారు మాతో చేస్తున్నారు. ఎందుకంటే వారి నుంచి మేము భారీ సుంకాలు వసూలు చేయడం లేదు కాబట్టి. భారత్ వాణిజ్య విధానాల కారణంగా అమెరికా తయారీదారులు తీవ్రంగా నష్టపోతున్నారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read..
జిన్‌పింగ్, పుతిన్‌తో మోదీ చేతులు కలపడం సిగ్గుచేటు
Donald Trump | ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పట్టణం చికాగో.. ట్రంప్ వ్యాఖ్యలకు కారణమిదే..!