Donald Trump : అమెరికాలోని కాల్పుల ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘాటుగా స్పందించారు. 54 మందిపై కాల్పులు జరిగిన చికాగో (Chicago) నగరాన్ని ‘ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పట్టణం’గా ట్రంప్ పేర్కొన్నారు. హింసాత్మకంగా మారిన లేబర్ డే వీకెండ్లో ఏడుగురి మరణించగా చాలామంది గాయపడ్డారు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ట్రంప్ నగరంలో నేర ప్రవృత్తి పెరగడంపై ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్కర్స్పై మండిపడ్డారు.
‘ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పట్టణం చికాగో. హత్యలకు రాజధాని కూడా ఈ నగరం. ఈ పరిస్థితుల్లో ఇల్లినాయిస్ గవర్నర్ ప్రిట్జ్కర్కు మా సాయం ఎంతో అవసరం. ఈ విషయం ఆయనకు ఇంకా తెలియదు. నగరంలో పెరుగుతున్న నేర ప్రవృత్తికి నేను త్వరగా అంతం చేస్తాను. వాషింగ్టన్ డీసీలో చేసినట్టే ఇక్కడా కఠిన చర్యలు తీసుకుంటాను. త్వరలోనే అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తాను’ అని ట్రుత్‌లో పోస్ట్‌లో ట్రంప్ వెల్లడించారు.
NEW: President Trump says he will “solve the crime problem” in Chicago, after Labor Day weekend shootings left 7 people dead, 40+ others wounded.
“Pritzker [IL Governor] needs help badly, he just doesn’t know it yet.” -POTUS pic.twitter.com/IUD4vE3A0N
— Breaking 4 News (@Breaking_4_News) September 2, 2025
పోలీసుల కథనం ప్రకారం.. చికాగో చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు చోట్ల కాల్పులు జరిగాయి. బ్రొంజెవిల్లాలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ 32 చోట్లు షూటింగ్స్ నమోదయ్యాయి. దాంతో, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక 17 ఏళ్ల అమ్మియి తన ఇంట్లోనే చిక్కుకుపోయింది. చికాగోలో వరుసగా మూడోవారం కాల్పులు జరిగాయి. దాంతో, ట్రంప్.. రాష్ట్ర అధికారులు మధ్య మరోసారి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. చికాగోలో ఫెడరల్ ఏజెంట్స్, జాతీయ భద్రతా దళాలను మోహరిస్తానని అధ్యక్షుడు చేసిన హెచ్చరికల్ని గవర్నర్ ప్రిట్జ్కర్ ఖండించారు. అలాంటి చర్యలు చట్టపరమైనవి కావని.. అమెరికన్లు ఏమాత్రం సహించరని ఆయన విమర్శించారు.