శుక్రవారం 27 నవంబర్ 2020
International - Nov 15, 2020 , 08:04:08

ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి: ట‌్రంప్‌

ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి: ట‌్రంప్‌

వాషింగ్ట‌న్‌: ఈ దీపావ‌ళి పండుగ‌ ప‌్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. దీపావ‌ళి పండుగ జ‌రుపుకుంటున్న ప్ర‌తిఒక్క‌రికి దీపావ‌ళి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. చెడుపై మంచి, చీక‌టిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన ఆధ్యాత్మిక‌ విజ‌యానికి ప్ర‌తీక‌గా ఈ పండుగ జ‌రుపుకుంటామ‌ని అన్నారు. ఇళ్లు, కార్యాల‌యాలు, దేవాల‌యాల్లో దీపాలు వెలుగుతున్న‌ప్పుడు వాటి వెచ్చ‌ద‌నం మ‌న జీవితాల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంద‌ని, భ‌క్తి, సాంప్ర‌దాయాల‌ను గుర్తుచేస్తాయ‌ని వెల్ల‌డించారు. అమెరికా చాలా న‌మ్మ‌క‌మైన దేశం, ప్ర‌తిఒక్క అమెరిక‌న్ రాజ్యాంగ బ‌ద్ధంగా జీవించేందుకు త‌మ ప‌రిపాల‌న కృషిచేస్తుంద‌ని ట్వీట్ చేశారు.  


సంప్ర‌దాయ పండుగ‌లు ప్ర‌తిష్టాత్మ‌కం: బైడెన్‌

అమెరికా త‌దుప‌రి అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. ల‌క్ష‌ల మంది హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధుల‌కు అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ దీపాళి శుభాకాంక్ష‌లు తెలిపారు. కొత్త‌సంవ‌త్స‌రంలో అంద‌రి జీవితాల్లో ఆనందం, శ్రేయ‌స్సు నిండి ఉండాల‌ని ఆకాంక్షించారు. సంప్ర‌దాయ పండుగ‌లు ప్ర‌తిఒక్క‌రికి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌వ‌ని చెప్పారు. క‌రోనా కాలంలో జ‌రుగుతున్న ఈ పండుగ‌లు ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని చెప్పారు. చీక‌టిని తొల‌గించి వెలుగు నింపుతుంద‌న్నారు. ‌ప్ర‌తి ఒక్క‌రికి దీపావ‌ళి, సాల్ ముబార‌క్ అని క‌మ‌లా హారీస్ ట్వీట్ చేశారు. అమెరికా, భార‌త్‌తో పాటు ప్ర‌పంచానికి ఈ దీపావ‌ళి కాంతులు నింపాల‌ని ఆంకాంక్షించారు.