సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 06, 2020 , 19:12:02

అమెరికాలో కౌంటింగ్ సెంటర్‌పై దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్‌

అమెరికాలో కౌంటింగ్ సెంటర్‌పై దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్‌

వాషింగ్టన్‌: అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఒక కౌంటింగ్‌ సెంటర్‌పై దాడికి ప్రయత్నించిన సాయుధ వ్యక్తిని ఆ దేశ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పెన్సిల్వేనియాలోని కౌంటింగ్‌ కేంద్రంలో మెయిల్‌ ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. మరోవైపు ఆయుధం కలిగిన ఒక వ్యక్తి కారులో వర్జీనియా నుంచి ఆ కేంద్రం వైపునకు వెళ్తుండాన్ని గమనించిన కొందరు పోలీసులను అలెర్ట్‌ చేశారు. దీంతో ఫిలడెల్ఫియా వద్ద ఆ కారును పోలీసులు నిలువరించారు. వాహనంలోని ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అతడ్ని అరెస్ట్‌ చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లను సాధించేందుకు బైడెన్‌, ట్రంప్‌ పోటీపడుతున్నారు. గెలుపును నిర్ణయించే కీలక రాష్ట్రల్లో పెన్సిల్వేనియా కూడా ఒకటి. కాగా మ్యాజిక్ ఫిగ‌ర్‌కు బైడెన్ చేరువలో ఉన్నప్పటికీ కోర్టుల‌ ద్వారా ఫ‌లితాన్ని రాబ‌ట్టే ప్ర‌య‌త్నాల్లో ట్రంప్‌ నిమగ్నమయ్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.