Donald Trump | గ్రీన్లాండ్ (Greenland) విషయంలో ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గ్రీన్‌లాండ్‌ను అమ్మే ప్రసక్తే లేదని డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ ట్రంప్ వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకునేందుకు ట్రంప్ టీమ్ సరికొత్త ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
57,000 మంది జనాభా కలిగిన ఈ ద్వీపాన్ని సొంతం చేసుకునేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నట్లు టాక్. డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాలో చేరేలా అక్కడి ప్రజలను (Greenland Citizens) ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కొంత డబ్బును కూడా ఆఫర్ చేసే యోచనలో ట్రంప్ టీమ్ ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒక్కొక్కరికి 10వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లు ఇచ్చేందుకు యూఎస్ అధికారులు సిద్ధమైనట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
Also Read..
Donald Trump | ముందు తూటా.. తర్వాతే మాట.. ట్రంప్‌ను భయపెట్టేలా డెన్మార్క్ నిబంధన
Venezuela | ఇంధన దురాశే అన్నిటికీ మూలం.. వెనెజువెలా అధ్యక్షురాలి కీలక వ్యాఖ్య
Trump Tariffs | భారత్‌పై 500% సుంకాలు.. కొత్త బిల్లుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్