న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల అక్ర మ రవాణా, ప్రజాస్వామ్యం, మానవ హక్కులకు సంబంధించి అమెరికా చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని, విదేశీ ఒత్తిడి వెనుక అసలు ఉద్దేశం చమురు దురాశేనని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని వీటీవీ ప్రత్యక్ష ప్రసారంలో ఆమె మాట్లాడుతూ అమెరికా ఇంధన దురాశ అందరికీ తెలిసిందేనని, ఆ దేశం వెనెజువెలా వనరులు కోరుకుంటున్నదని, డ్రగ్ ట్రాఫికింగ్, ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై చెబుతున్న అబద్ధాలన్నీ కేవలం కుంటి సాకులేనని ఆమె చెప్పారు.