Donald Trump | ఇజ్రాయెల్- హమాస్‌ల (Israel-Hamas) మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక ముందడుగు పడింది. గాజాలో యుద్ధం (Gaza Plan) ముగింపుకు ట్రంప్ సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ అంగీకరించింది.
సోమవారం వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాకుండా.. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నట్లు నెతన్యాహు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాదు హమాస్ కూడా ఈ ప్రణాళికను అంగీకరించాలని సూచించారు. లేదంటే ఆ ఉగ్ర సంస్థను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. శాంతి కోసమే ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. అయితే, హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్‌కు ముప్పు ఉండకూడదన్నారు.
Also Read..
Earthquake | మయన్మార్‌లో భూకంపం.. అస్సాం, మణిపూర్, నాగాలాండ్‌లో ప్రకంపణలు
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థ