Donald Trump | హమాస్ కథ ముగించాల్సిందే.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ కీలక సూచన
Donald Trump | కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ (Hamas) తిరస్కరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రస్థాయిలో స్పందించారు.
Donald Trump | కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ (Hamas) తిరస్కరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ హమాస్‌పై విరుచుకుపడ్డారు. హమాస్‌కు శాంతి నెలకొల్పడంపై ఆసక్తిలేదని వ్యాఖ్యానించారు. ఇక హమాస్ కథ ముగించాల్సిందేనని పేర్కొన్నారు. గాజాలో దాడులు తీవ్రతరం చేయాలంటూ ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు సూచించారు.
స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ‘హమాస్‌కు ఎటువంటి డీల్ చేసుకునేందుకు ఇష్టం లేదు. వాళ్లకు శాంతి నెలకొల్పడంపై ఆసక్తి లేదు. వాళ్లు చావాలని కోరుకుంటున్నట్టు ఉంది. ఇది చాలా దారుణం. ఇక దాని కథ ముగించాల్సిందే. గాజా (Gaza)లో మొదలు పెట్టిన పనిని పూర్తి చేయాలి. ప్రక్షాళన చేయండి. దాడులను ఉద్ధృతం చేయండి’ అంటూ ఇజ్రాయెల్ (Israel)కు ట్రంప్ సూచించారు.
కాగా, మధ్యప్రాచ్యంలో శాంతి చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ హమాస్‌తో చర్చల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో తమ వ్యూహాల్ని సమీక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. చర్చల్లో ప్రతిష్టంభనకు హమాస్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇక హమాస్ చెరలో బందీలను విడిపించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ తెలిపారు.
Also Read..
IRCTC | రైళ్లలో ఆహార నాణ్యతపై 2024-25లో 6,645 ఫిర్యాదులు.. వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి
Indian Embassy | థాయ్-కంబోడియా సరిహద్దుల్లో ఘర్షణలు తీవ్రతరం.. ఇండియన్ ఎంబసీ కీలక అడ్వైజరీ
Kargil Vijay Diwas | పాక్ సైనికులపై ఫిరంగుల వర్షం.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Donald Trump
- Gaza
- Hamas
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

