Kargil Vijay Diwas | కార్గిల్ 26వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) నేడు. 1999 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్‌ను ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారు. ఈ సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను దేశ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని పేర్కొంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ కొండలను ఆక్రమించుకోవాలన్ని పాకిస్థాన్ పన్నిన కుట్రలను భారతదేశం విజయవంతంగా తిప్పికొట్టింది. దాదాపు 12 మంది పాకిస్థాన్ సైనికులు కార్గిల్ అజామ్ పోస్టును స్వాధీనం చేసుకున్నారు. ఈ పాకిస్థాన్ సైనికులను భారత్‌కు చెందిన ఒకర గొర్రెల కాపరి గుర్తించి భారత ఆర్మీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దాంతో పాకిస్థాన్ సైన్యం చొరబాటు గురించి సమాచారం వచ్చింది. దాంతో ‘ఆపరేషన్ విజయ్’ చేపట్టేందుకు భారత సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. 1999 మే 3 న ప్రారంభమైన ఈ యుద్ధం దాదాపు మూడు నెలల పాటూ సాగింది. యుద్ధంలో భారత సైన్యం పాకిస్థాన్ తోక ముడిచి పారిపోయేలా చేసి కార్గిల్ కొండలను రక్షించారు. కార్గిల్ కొండలను కాపాడుకోవడంతో జూలై 26న యుద్ధం ముగిసింది.
పాక్ సైనికులు ఎత్తైన కొండలపై కూర్చున్న కారణంగా భారత సైనికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. శత్రు సైనికులు చూడకుండా ఉండటానికి రాత్రి వేళలో కొండలపైకి ఎక్కారు. పాకిస్థాన్ సైన్యాన్ని కార్గిల్ విడిచి పారిపోయేలా చేయడంలో ఆర్మీతోపాటు వైమానిక దళం, నావికాదళం కూడా పెద్ద పాత్ర పోషించాయి. మిగ్-29, మిరాజ్-2000 విమానాల ద్వారా వైమానిక దళం పాకిస్థాన్ సైనికులపై బాంబు దాడులు చేసి పాక్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఆకాశం నుంచి వైమానిక దళం దాడి, భూతలం నుంచి బోఫోర్స్ ఫిరంగుల నుంచి గుండ్లతో పాకిస్థాన్ సైనికులపై వర్షం కురిపించాయి. రెండు నెలలకు పైగా కొనసాగిన ఈ యుద్ధంలో 527 మంది భారతీయ సైనికులు అమరవీరులయ్యారు. పాకిస్థాన్‌కు చెందిన 3,000 మంది సైనికులు కూడా మరణించారు. దేశాన్ని కాపాడటంలో ప్రాణాలను ఫణంగా పెట్టిన కార్గిల్‌లో విజయాన్ని నమోదుచేసిన సందర్భానికి గుర్తుగా ఏటా కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటున్నాం. భారతదేశం యొక్క ఈ విజయాన్ని, సైనికుల శౌర్యాన్ని గుర్తుచేసుకుంటుంటాం.
Also Read..
Kargil Vijay Diwas | కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళి.. ప్రత్యేక వీడియో రూపొందించిన వాయుసేన
ఇందిరా గాంధీని అధిగమించిన మోదీ