న్యూఢిల్లీ: కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న పాక్ కుట్రలను తమ తెగువతో ఇండియన్ ఆర్మీ అడ్డుకున్నది. ఆపరేషన్ విజయ్ పేరుతో కార్గిల్ యుద్ధాన్ని ప్రారంభించి శత్రు సైనికులను తరమికొట్టింది. ఇది జరిగి శనివారంతో 26 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని ద్రాస్‌లో వార్ మెమోరియల్ వద్ద వారి కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించారు. విద్యార్థులు, స్థానికులతో కలిసి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు.
#WATCH | Dras, Kargil | Families of valiant soldiers who laid down their lives in the line of duty in the 1999 Kargil War, pay tribute to the warriors on the occasion of 26th Kargil Vijay Diwas at the War Memorial pic.twitter.com/KbqiGMHHm8
— ANI (@ANI) July 26, 2025
#WATCH | Dras, Kargil | Union Minister Mansukh Mandaviya and Union Minister of State for Defence, Sanjay Seth participate in Padyatra and pay homage to honor the valor of the army personnel who lost their life in the line of action during the Kargil War of 1999 on Kargil Vijay… pic.twitter.com/fvUtRZNbIE
— ANI (@ANI) July 26, 2025
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా కార్గిల్ అమరవీరులకు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. మన దేశాన్ని రక్షించడం కోసం అత్యంత కఠినమైన భూభాగాల్లో అసాధారణ ధైర్యం, దృఢ సంకల్పంతో పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నా. కార్గిల్ యుద్ధంలో వారి త్యాగం, మన సాయుధ దళాల అచంచల సంకల్పానికి నిదర్శనం, వారికి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని ట్వీట్ చేశారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.
On Kargil Vijay Diwas, I pay heartfelt tributes to our bravehearts who displayed extraordinary courage, grit and determination in defending our nation’s honour in the toughest of terrains. Their supreme sacrifice during Kargil war is a timeless reminder of the unwavering resolve…
— Rajnath Singh (@rajnathsingh) July 26, 2025
#WATCH | Kargil Vijay Diwas | Delhi: Defence Minister Rajnath Singh arrives at the National War Memorial to pay tributes to those who laid down their lives in the line of duty during the Kargil War in 1999. Chief of Defence Staff and tri-services chiefs are also present.
Today… pic.twitter.com/AzbEaGAtGA
— ANI (@ANI) July 26, 2025
మరోవైపు కార్గిల్ అమర వీరులకు నివాళులర్పిస్తూ భారత వాయుసేన ప్రత్యేక వీడియోను రూపొంచింది. దానిని తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అందులో రాసుకొచ్చింది.
The Indian Air Force pays heartfelt tribute to the valiant Warriors of the Kargil War. Their courage, sacrifice, and unwavering resolve continue to inspire a nation united in gratitude.#KargilVijayDiwas #26YearsOfKargil#OpVijay#OpSafedSagar… pic.twitter.com/PX4cZfBkYa
— Indian Air Force (@IAF_MCC) July 26, 2025