Earthquake | తాలిబన్ పాలిత దేశం అప్ఘానిస్థాన్ (Afghanistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center of Seismology) వెల్లడించింది. భూమికి 140 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, ఈ ప్రకంపనల ధాటికి ప్రాణ, ఆస్తి నష్టంకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, గత నాలుగు రోజుల్లో ఆ దేశంలో భూకంపం సంభవించడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అంతకుముందు అంటే ఆదివారం చైనా (China)లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 4.5 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు నేషనల్ షెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు తెలిపింది. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
చైనాతోపాటు టిబెట్‌లో కూడా ఆదివారం రెండుసార్లు భూమి కంపించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. మొదటి భూకంపం 3.8 తీవ్రతతో మధ్యాహ్నం 1:14 గంటలకు సంభవించగా, సాయంత్రం 5:07 గంటలకు మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత 3.7గా నమోదైందని ఎన్సీఎస్ వెల్లడించింది. మయన్మార్ (Myanmar)లోనూ ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు నమోదయ్యారు. 3.9 తీవ్రతతో భమి కంపించింది.
Also Read..
Bomb Blast | బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు.. నలుగురు మృతి
Joe Biden | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్
Greater Bangladesh | గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌లో భారత రాష్ర్టాలు!