Bomb Blast | భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్ (Pakistan)లో భారీ పేలుడు సంభవించింది. బలోచిస్థాన్ ప్రావిన్ (Balochistan province)లోని ఓ మార్కెట్ వద్ద బాంబు పేలింది (Bomb Blast). ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.
బలోచిస్థాన్‌లోని కిల్లా అబ్దుల్లా (Killa Abdullah) జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ జబ్బర్ మార్కెట్ (Jabbar Market) సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనతో అనేక దుకాణాలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు కిల్లా అబ్దుల్లా డిప్యూటీ కమిషనర్ రియాజ్ ఖాన్ తెలిపారు. దాదాపు 20 మందికిపైగా గాయాలపాలైనట్లు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రియాజ్ ఖాన్ వెల్లడించారు.
Also Read..
Joe Biden | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్
Greater Bangladesh | గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌లో భారత రాష్ర్టాలు!
Israel Strikes | గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 103 మంది మృతి