ఆదివారం 09 ఆగస్టు 2020
International - Jul 11, 2020 , 17:33:01

భారత్‌కు చెందిన 19 మిలియన్ల వీడియోలను తొలగించిన టిక్‌టాక్‌

భారత్‌కు చెందిన 19 మిలియన్ల వీడియోలను తొలగించిన టిక్‌టాక్‌

ముంబై: ఇటీవల భారత్‌లో నిషేధానికి గురైన టిక్‌టాక్‌ తాను తొలగించిన వీడియోల సంఖ్యను వెల్లడించింది. 2019 ద్వితీయార్థంలో భారత్‌కు చెందిన 19 మిలియన్ల వీడియోలను రిమూవ్‌ చేసినట్లు పేర్కొంది. ఇవన్నీ తమ కంటెంట్‌ పాలసీని ఉల్లంఘించడంతో తొలగించినట్లు వివరించింది. తొలగించిన వీడియోల సంఖ్య దేశవ్యాప్తంగా 49 మిలియన్లు ఉన్నట్లు ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్‌లో వెల్లడించింది. 

టిక్‌టాక్‌కు ఇండియా నుంచి మొత్తం 302 అభ్యర్ధనలు వచ్చాయని, 90 శాతం అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నామని నివేదికలో పేర్కొంది. 100 అభ్యర్ధనలతో, అమెరికా రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది. టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా తొలగించిన వీడియోల సంఖ్య ఆరు నెలల కాలంలో అప్‌లోడ్ చేసిన వీడియోలో ఒకశాతం మాత్రమేనని వివరించింది. అలాగే, వినియోగదారుల సమాచారం, వీడియోల ఉపసంహరణ కోసం చైనా నుంచి ఎలాంటి అభ్యర్థనలూ రాలేదని టిక్‌టాక్‌ పేర్కొంది. చైనా ప్రభుత్వం అభ్యర్థన మేరకు తాము ఏ కంటెంట్‌నూ తొలగించలేదని, అడిగినా చేయమని టిక్‌టాక్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo