e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News చరిత్రలో ఈరోజు : వేల మందిని పొట్టన పెట్టుకున్న లండన్‌ పొగమంచు

చరిత్రలో ఈరోజు : వేల మందిని పొట్టన పెట్టుకున్న లండన్‌ పొగమంచు

Today History : లండన్‌లో 1952 లో సరిగ్గా ఇదే రోజున పొగమంచు మెల్లగా మొదలై అంతటా వ్యాపించింది. ఐదు రోజుల పాటు లండన్‌ను చుట్టుముట్టిన పొగమంచు కారణంగా దాదాపు 12 వేల మంది మృత్యువాత పడినట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి. అలాగే, దాదాపు లక్షన్నర మంది వివిధ వ్యాధులకు గురై బాధపడినట్లు లండన్‌ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వేలాది జంతువులు మృత్యువాత పడ్డాయి. చాలా మంది పరిశోధకులు బొగ్గు కారణంగా ఇలా జరిగిఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ.. 69 ఏండ్లు గడిచిపోయినా ఇప్పటికీ ఖచ్చితమైన కారణాలు, స్వభావం మిస్టరీగానే మిగిలిపోయాయి. దీన్నే ‘గ్రేట్‌ స్మోగ్‌ ఆఫ్‌ లండన్‌’ అని కూడా పిలుచుకుంటారు.

డిసెంబర్‌ నెలలో బ్రిటన్‌లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో తరచుగా పొగమంచు ఉంటుంది. 1952 డిసెంబర్ 5 ఉదయం కూడా అలాగే ఉన్నది. లండన్ వాసులు తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి బయట చీకట్లు, చుట్టుపక్కల పొగలు అలుముకున్నాయి. ఇలాంటి పొగమంచు సాధారణమే అని అక్కడి వారు భావించారు. అయితే, రోజంతా గడిచినా పొగలు తగ్గకపోగా మరింత పెరగడం ప్రారంభమయ్యాయి. దాంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. అలా ఐదు రోజులపాటు లండన్‌ వాసులను పొగమంచు గడగడలాడించింది.

- Advertisement -

ఈ ప్రమాదకరమైన స్మోగ్ ఫిల్టర్ కావడానికి గల కారణాలను ప్రభుత్వం తర్వాత వెల్లడించింది. 13వ శతాబ్దం నుంచి లండన్‌ వాసులు బొగ్గును కాల్చడం అలవాటు చేసుకున్నారు. అక్కడి ఫ్యాక్టరీల్లో కూడా బొగ్గు ఎక్కువగా వాడేవారు. అటువంటి పరిస్థితిలో ప్రజల ఇళ్ళు, కర్మాగారాల నుంచి వెలువడే పొగ గాలిలో పెరిగిపోయింది. పొగ, తేమ ఒకదానికొకటి కలుసుకుని పొగమంచుగా మారి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యేలా చేసింది. దీని కారణంగా వేలాది మంది ప్రజలు చనిపోగా.. లక్షన్నరకుపైగా జనం వివిధ వ్యాధులకు గురయ్యారు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2016: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూత

2013: జోహన్నెస్‌బర్గ్‌లో నెల్సన్ మండేలా కన్నుమూత

2003: చైనాలో తొలిసారిగా జరిగిన ప్రపంచ అందాల పోటీలో విజేతగా నిలిచిన ఐర్లాండ్‌కు చెందిన రోసన్నా దాస్నన్

2001: ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒసామా బిన్ లాడెన్ నివసిస్తున్న తోరా బోరా పర్వత స్థావరాన్ని స్వాధీనం చేసుకున్న అమెరికా సైన్యం

1989: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని తొలిసారి అధిష్టించిన ములాయం సింగ్ యాదవ్

1973: యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా గెరాల్డ్ ఫోర్డ్ ప్రమాణ స్వీకారం

1971: బంగ్లాదేశ్‌ను ఒక దేశంగా గుర్తించిన భారతదేశం

1969: భారతదేశపు ప్రసిద్ధ మహిళా షూటర్ అంజలి భగవత్ జననం

1958 : ప్రపంచవ్యాప్తంగా ఎస్టీడీ ఫోన్‌ కాల్స్‌ ప్రారంభం

1950: భారతీయ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు అరబిందో ఘోష్ మరణం

1943: కోల్‌కతాపై బాంబును జారవిడిచిన జపాన్ విమానం

ఇవి కూడా చ‌ద‌వండి..

గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!

చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?

ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?

ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..! ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకుల వెల్లడి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement