Myanmar | మయన్మార్ (Myanmar) తూర్పు సముద్ర తీరంలో ఇటీవల చోటు చేసుకున్న రెండు పడవ ప్రమాదాలు తీవ్ర విషాదానికి (two shipwrecks off Myanmar coast) దారితీశాయి. ఈ రెండు ప్రమాదాల్లో దాదాపు 400 మందికిపైగా రోహింగ్యా (Rohingya) శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు.
ఐక్యరాజ్య సమితి (United Nations) అనుబంధ శరణార్థి సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘోర ఘటనల్లో మొత్తం 427 మంది రోహింగ్యా శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 9న తొలి ప్రమాదం సంభవించింది. మొత్తం 267 మందితో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 201 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే రెండో పడవ ప్రమాదానికి గురైంది. మే 10వ తేదీన 247 మందితో వెళ్తున్న పడవ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 226 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు యూఎన్ అనుబంధ శరణార్థి సంస్థ వెల్లడించింది.
మయన్మార్‌లో దశాబ్దాలుగా రోహింగ్యాలు హింసకు గురవుతున్నారు. దీంతో తమ దేశంలో అణచివేత, అంతర్యుద్ధం నుంచి తప్పించుకునేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్ర మార్గం గుండా ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. 2017లో లక్షలాది మంది రోహింగ్యాలు మయన్మార్‌ను వీడి బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. గతేడాది సైనిక తిరుగుబాటు అనంతరం.. ఈ వలసలు మరింత పెరిగాయి.
Also Read..
Donald Trump | యాపిల్నేకాదు.. శాంసంగ్‌నూ టార్గెట్ చేసిన ట్రంప్
UN | ఉగ్రదాడుల్లో 20,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.. యూఎన్‌లో పాక్‌పై విరుచుకుపడిన భారత్