Donald Trump | ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ (Apple)కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోనే ఫోన్లను తయారు చేయాలని చెప్పారు. లేదంటే 25శాతం సుంకాన్ని విధిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. అయితే, మరో దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థకు కూడా ట్రంప్ ఇదే తరహా హెచ్చరికలు చేశారు.
యాపిక్ ప్రత్యర్థి, దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్ (Samsung) తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాలని స్పష్టం చేశారు. లేదంటే 25 శాతం దిగుమతి సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలో పరికరాలను విక్రయించే ఏ మొబైల్ తయారీ సంస్థకైనా ఈ టారిఫ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
‘యాపిల్ ఒక్కటే కాదు.. శాంసంగ్ అయినా.. ఇంకే సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాలి. అలాకాకుండా ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసినవి తీసుకొస్తే మాత్రం అది అన్యాయమైన ప్రక్రియ. అమెరికాలో పరికరాలను విక్రయించే ఏ మొబైల్ తయారీ సంస్థ అయినా.. ఇక్కడ ప్లాంట్ నిర్మిస్తే ఎలాంటి టారిఫ్‌లు ఉండవు. లేదంటే 25 శాతం దిగుమతి సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్.. అమెరికా మార్కెట్లో నంబరు 2 విక్రేతగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఏటా 220 మిలియన్ ఫోన్లను విక్రయిస్తుండగా.. ఇందులో 60శాతం మొబైల్స్‌ను వియత్నాంలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఎక్కువగా అమెరికాకి ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. 2024లో భారత్‌లో తయారు చేసిన మొత్తం స్మార్ట్ఫోన్లలో యాపిల్, శాంసంగ్ 94 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2025 మార్చి త్రైమాసికంలో భారత్‌లో శాంసంగ్ మార్కెట్ వాటా 17 శాతంగా ఉంది.
Also Read..
UN | ఉగ్రదాడుల్లో 20,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.. యూఎన్‌లో పాక్‌పై విరుచుకుపడిన భారత్
Shashi Tharoor | ఉగ్రవాదం విషయంలో భారత్ మౌనంగా ఉండదు : శశి థరూర్
Jharkhand | జార్ఖండ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి