UN | ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ తగిన సమాధానం ఇచ్చింది. పౌరుల భద్రతపై జరిగిన చర్చలో పాక్ రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) ఉపసంహరణ అంశాన్ని లేవనెత్తారు. ‘నీరు జీవనానికి ఆధారం. యుద్ధానికి ఆయుధం కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ (Parvathaneni Harish) ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం కారణంగానే 65 ఏళ్ల నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు పర్వతనేని హరీశ్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా 2008 ముంబై దాడులు, గత నెల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులను ఉదహరిస్తూ.. దశాబ్దాలుగా ఉగ్రదాడులకు కేంద్రంగా ఉన్న ఇస్లామాబాద్‌పై విరుచుకుపడ్డారు. భారత్ దశాబ్దాలుగా పాక్ పెంచి పోషిస్తోన్న ఉగ్రసంస్థల వల్లే ముప్పు ఎదుర్కొంటోందన్నారు. ఉగ్రవాద దాడుల్లో 20,000 మందికి పైగా భారతీయులు మరణించినట్లు చెప్పారు. ‘ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రం’గా ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాదంపై ప్రసంగించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు, పౌరులకు మధ్య తేడా చూపించలేని దేశానికి పౌరుల భద్రతపై చర్చించే నైతిక హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత వరకూ.. సింధూ జలాల ఒప్పంద రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు.
Also Read..
Shashi Tharoor | ఉగ్రవాదం విషయంలో భారత్ మౌనంగా ఉండదు : శశి థరూర్
Jharkhand | జార్ఖండ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
MBBS Student | వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి..