Myanmar | మయన్మార్ (Myanmar)లో మృత్యుఘోష కొనసాగుతోంది. వారం రోజుల క్రితం అక్కడ సంభవించిన భూకంపం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ భూవిలయంలో మరణించిన వారి సంఖ్య 3,354కు చేరింది. 4,850 మంది గాయాలపాలయ్యారు. 220 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక మీడియా శనివారం వెల్లడించింది.
గత నెల 28 మధ్యాహ్నం సమయంలో మయన్మార్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే 7.7, 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు రోడ్లు, వంతెనలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో పలు దేశాల రెస్క్యూ సిబ్బంది సహాయచర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశముందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా వేసిన విషయం తెలిసిందే.
Also Read..
“ప్రార్థనల్లోనే 700 మంది సమాధి”
“Myanmar | భూకంపం అనంతరం మూడు రోజుల తర్వాత.. శిథిలాల నుంచి సజీవంగా బయటపడ్డ మహిళ”
“Earthquake | భూ ప్రకోపం తీరని శాపం.. మానవాళిపై పెను ప్రభావం”