Myanmar | మయన్మార్ (Myanmar) భూ విలయంలో (Earthquake) మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 3 వేలు దాటింది. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మయన్మార్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే 7.7, 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు రోడ్లు, వంతెనలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకూ 3,085 మంది మరణించినట్లు మయన్మార్ సైన్యం గురువారం ప్రకటించింది. దాదాపు 4,715 మంది గాయపడినట్లు పేర్కొంది. మరో 341 మంది గల్లంతైనట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం దేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. 17 దేశాల నుంచి వచ్చిన సహాయ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఈ విపత్తులో అండగా నిలబడి అవసరమైన సాయాన్ని అందిస్తున్న దేశాలకు ఈ సందర్భంగా సైన్యం కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు ప్రస్తుత విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశముందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా వేసిన విషయం తెలిసిందే.
Also Read..
Sonia Gandhi | వక్ఫ్ బిల్లును లోక్సభలో ‘బుల్డోజ్’ చేశారు : సోనియా గాంధీ
PM Modi | థాయ్లాండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ