e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News 12 వేల మంది అమెరికన్లకు 9 కోట్ల టోకరా, అరెస్ట్

12 వేల మంది అమెరికన్లకు 9 కోట్ల టోకరా, అరెస్ట్

12 వేల మంది అమెరికన్లకు 9 కోట్ల టోకరా, అరెస్ట్

కాన్పూర్‌ : అమెరికన్లను నిండా ముంచిన మోసగాడు మొహిందర్‌ శర్మను ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతగాడు ఢిల్లీకి చెందిన ఒక కంపెనీలో భాగస్వామిగా ఉన్నట్లు తేలడంతో ఆయన లెక్కలను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆదాయం పన్ను, జీఎస్టీ విభాగం అధికారుల సాయంతో ఇతగాడి లెక్కలను బయటకు తీసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మొహిందర్‌ శర్మతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తున్నది. వీరు ఫేక్‌ కాల్‌ సెంటర్‌ నుంచి ఫోన్లు చేస్తూ 12 వేల మంది అమెరికన్లను దాదాపు రూ.8-9 కోట్ల మేర మోసం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అంతర్జాతీయంగా మోసాల వెబ్‌ను వ్యాప్తి చేసిన మొహిందర్‌ శర్మ, కాన్పూర్‌లోని కాకాదేవ్‌లోని ఓం చౌరాహా వద్ద ఉన్న ఒక హాస్టల్‌లో బేస్మెంట్‌ను రూ.45 వేల అద్దెకు తీసుకొని క్వాడ్రంట్ రీసెర్చ్ అండ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కాల్ సెంటర్‌ను ప్రారంభించాడు. ఇక్కడ ఒక షిఫ్ట్‌లో 15 నుంచి 20 మంది ఉద్యోగులు పనిచేసేవారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న యువతీయువకులు, లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగాలు వదిలి ఇంట్లో కూర్చున్న వారిని సంప్రదించి.. వారి అర్హతను బట్టి రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఉద్యోగాలు ఇచ్చి చేర్చుకున్నాడు. నకిలీ కాల్‌ సెంటర్‌ మాస్టర్‌ మైండ్‌ అయిన మొహిందర్‌ శర్మ నోయిడాలో నివసించే రిటైర్డ్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారి కుమారుడు. పుణె యూనివర్శిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తిచేసిన మొహిందర్‌ శర్మ.. లాక్‌డౌన్‌ సమయంలో ఢిల్లీలోని ఓ కంపెనీలో భాగస్వామిగా చేరారు. ఈ కంపెనీకి అమెరికాలో కూడా బ్రాంచ్‌ ఉన్నది. దీన్ని ఆసరగా చేసుకుని నకిలీ కాల్‌సెంటర్‌ను ప్రారంభించిన మొహిందర్‌ శర్మ.. అమెరికన్లను మోసం చేయడం మొదలెట్టాడు.

- Advertisement -

అమెరికన్లకు మాల్‌వేర్‌ ద్వారా మెసేజ్‌ పంపి వారి కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసేవాడు. అనంతరం కాల్‌ సెంటర్‌ నుంచి ఫోన్లు చేసి మాల్‌వేర్‌ను తొలగించేందుకు 200-300 డాలర్లు ఛార్జ్‌ చేసేవారు. తాము చెప్పిన అకౌంట్లో డబ్బు జమకాగానే మాల్‌వేర్‌ను తొలగించి డాటా రికవరీ చేసేవారు. ఇలాంటి పనులు చేసి పెట్టేందుకు నోయిడాలో 25 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో బ్యాక్‌ ఆఫీస్‌ను కూడా సిద్ధం చేశాడు. ఇలా దాదాపు 12 వేల మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ టీచర్లు జిహదీలను తయారుచేస్తారంట..!

కృత్రిమ మేధస్సుకు మెదడు న్యూరాన్ల మోడల్‌ సృష్టి

షారుఖ్‌ఖాన్‌ చేసిన పనిని బయటపెట్టిన దినేశ్‌ కార్తీక్‌

సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్‌..! ఎందుకంటే..?

ఆఫ్ఘాన్‌లోకి జిహదీలను పంపారు : పాక్‌పై ఘనీ ఘాటు వ్యాఖ్య

త్వరలో స్పేస్‌ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..

కరోనా ట్రైలరే.. ముందుంది ముసళ్ల పండుగ : రిచర్డ్‌ సెనెట్‌

చరిత్రలో ఈరోజు.. భారత స్వాతంత్య్ర చట్టానికి బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
12 వేల మంది అమెరికన్లకు 9 కోట్ల టోకరా, అరెస్ట్
12 వేల మంది అమెరికన్లకు 9 కోట్ల టోకరా, అరెస్ట్
12 వేల మంది అమెరికన్లకు 9 కోట్ల టోకరా, అరెస్ట్

ట్రెండింగ్‌

Advertisement