Yemen | యెమెన్ (Yemen)లోని హౌతీ రెబల్స్ ఆధీనంలో ఉన్న సనా ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ (Israel) దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఎయిర్‌పోర్ట్‌లోని విమానాలను ఐడీఎఫ్ ఫైటర్ జెట్లు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తాజాగా ప్రకటించారు. సనా ఎయిర్పోర్ట్ (Sanaa airport)లోని హౌతీ ఉగ్రవాదులే (Houthi rebels) లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపారు. హౌతీల చివరి విమానాన్ని కూడా ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇజ్రాయెల్‌పై దాడులు చేసేవారెవరైనా సరే భారీ మూల్యం చెల్లించాల్సిందే అని ఈ సందర్భంగా హెచ్చరించారు.
యెమెన్‌లోని హౌతీ రెబల్స్ పాలస్తీనాలోని హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో హౌతీ రెబల్స్ ప్రయోగించిన క్షిపణులు బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పడ్డాయి. దీంతో కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక మంగళవారం హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై రెండు క్షిపణులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులకు టెల్ అవీవ్ తాజాగా ప్రతీకార దాడులు చేపట్టింది. సనా ఎయిర్‌పోర్ట్‌లోని హౌతీ ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడీఎఫ్ ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి.
Also Read..
Indians Missing | ఇరాన్లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. రూ.కోటి డిమాండ్ చేసిన కిడ్నాపర్లు
Visa Free | గుడ్ న్యూస్ చెప్పిన ఫిలిప్పీన్స్.. భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ
Satellite pics | భారత్ దాడితో పాక్ ఎయిర్‌బేస్ భూగర్భ కేంద్రం వద్ద భారీ గుంత.. ఉపగ్రహ చిత్రాలు