Indians Missing | ఇరాన్ (Iran)లో ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు (Indians Missing). ఈ విషయాన్ని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ధ్రువీకరించింది. అదృశ్యమైన ముగ్గురి జాడ కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొంది.
తప్పిపోయిన వారిని పంజాబ్ (Punjab)లోని సంగ్రూర్‌కు చెందిన హుషన్‌ప్రీత్ సింగ్, ఎస్బీఎస్ నగర్‌కు చెందిన జస్పాల్ సింగ్, హోషియాపూర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్‌గా గుర్తించారు. మే 1న టెహ్రాన్ (Tehran)లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే వీరు అదృశ్యమైనట్లు ఎంబసీ తెలిపింది. ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొంది.
మరోవైపు పంజాబ్‌లోని ఓ ఏజెంట్ ముగ్గురు యువకులను దుబాయ్-ఇరాన్ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతానని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరాన్లో బస కల్పిస్తామని హామీ ఇచ్చి.. అక్కడ దిగగానే కిడ్నాప్ చేసినట్లు ఆరోపించారు. కిడ్నాపర్లు రూ.కోటి డిమాండ్ చేసినట్లు కూడా కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాదు, యువకుల్ని తాళ్లతో కట్టేసి చేతుల నుంచి రక్తం కారుతున్న వీడియోని కూడా పంపినట్లు తెలిపారు. అడిగిన డబ్బు పంపకపోతే వారిని చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ఆ ముగ్గురిని విదేశాలకు పంపిన ఏజెంట్ హోషియాపూర్‌లో కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Also Read..
Union Cabinet | రైతులకు గుడ్‌న్యూస్.. వరికి మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం