Union Cabinet | రైతులకు గుడ్‌న్యూస్.. వరికి మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఎమ్మెస్పీ 50శాతం పెంచింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఎమ్మెస్పీ 50శాతం పెంచింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. గత పది పదకొండేళ్లలో ఖరీప్ పంటలకు ఎమ్మెస్పీ భారీగా పెరిగిందన్నారు. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు ఎమ్మెస్పీ పెంపునకు ఆమోదం చెప్పింది.
Read Also : Heavy Rains | నైరుతి రుతుపవనాల ప్రభావం.. మూడురోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు..!
2025-26 ఖరీఫ్ సీజన్‌కు వరికి క్వింటాల్‌కు రూ.69 మద్దతు పెంచింది. తాజాగా పెంపుతో రూ.2,369 పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కేటాయించినట్లు పేర్కొన్నారు. జొన్నలు క్వింటాల్‌కు రూ.328, సజ్జలు క్వింటాల్‌కు రూ.150, రాగులు క్వింటాల్ రూ.596, మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.175 పెంచినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. కందిపప్పు క్వింటాల్‌కు రూ.450, పెసర్లు క్వింటాల్‌కి రూ.86, మినుములు క్వింటాల్ రూ.400, వేరుశెనగ క్వింటాల్ రూ.480 పెంచినట్లు వివరించారు.
Read Also : Mock Drills | పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో రేపు మాక్‌డ్రిల్స్.. ప్రజలను అప్రమత్తం చేసిన కేంద్రం
పొద్దుతిరుగు క్వింటా రూ.441, సోయాబీన్ క్వింటా రూ.436, కుసుములు క్వింటా రూ.579, వలిసెలు క్వింటాల్‌కి రూ.820, పత్తి క్వింటాల్‌కు రూ.589 పెంపు, నువ్వులు క్వింటాల్‌కు రూ.579 పెంచినట్లు చెప్పారు. అలాగే, బద్వేల్-నెల్లూరు నాలుగు వరుసల రోడ్డుకు రూ.3,653 కోట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ – కృష్ణపట్నం ఓడరేవుకు, హెచ్‌హెచ్67లోని ఓ భాగానికి ఓడరేవు కనెక్టివిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పారిశ్రామిక కారిడార్ల కలుపనున్నది. దాదాపు సుమారు 108 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం జరుగనుండగా.. వార్దా-బల్లార్షా నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

