Mock Drills | పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ (India-Pak) మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ సరిహద్దులోని నాలుగు రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్స్ (Mock Drills) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జమ్ము కశ్మీర్ (Jammu Kashmir), పంజాబ్ (Punjab), రాజస్థాన్ (Rajasthan), గుజరాత్ (Gujarat)లో రేపు సాయంత్రం మాక్ డ్రిల్స్ ఉంటాయని తెలిపింది. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మే 7-8 తేదీల్లో దేశవ్యాప్తంగా సెక్యూరిటీ మాక్‌డ్రిల్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా 244 జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, అలాగే కశ్మీర్, గుజరాత్, హర్యాణా, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ డ్రిల్స్ జరిగాయి. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవగాహన కల్పించడం ఈ డ్రిల్స్ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
Also Read..
Siddaramaiah | పాపం.. కమల్ హాసన్‌కు కన్నడ సుదీర్ఘచరిత్ర గురించి తెలియదనుకుంటా : సిద్ధరామయ్య
Ashoka University: అశోకా వర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ తాత్కాలిక బెయిల్ పొడిగింపు