Viral news : అదొక పెద్ద రెసిడెన్షియల్ సొసైటీ (Residential Society). ఆ సొసైటీలోని ఫ్లాట్ల ఓనర్లంతా ధనికులే. అయితే కారు పార్కింగ్ ప్లేస్ (Parking place) విషయంలో ఆ సొసైటీ సెక్రెటరీ (Secretary) కి, ఓ ఫ్లాట్ ఓనర్కు మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఫ్లాట్ ఓనర్ సొసైటీ సెక్రెటరీ ముక్కు కొరికేశాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ సిటీ (Kanpur city) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అపార్టుమెంట్ పార్కింగ్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్లోని నరమావు ఏరియాలోని రెసిడెన్షియల్ సొసైటీకి రిటైర్డ్ ఇంజినీర్ రూపేంద్ర యాదవ్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. సొసైటీలోని రతన్ ప్లానెట్ అపార్టుమెంట్లో క్షితిజ్ మిశ్రా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల క్షితిజ్ మిశ్రా తన కారును పార్కింగ్ చేసే ప్రదేశంలో మరో వ్యక్తి తన కారును పార్క్ చేశాడు. ఈ విషయాన్ని క్షితిజ్ మిశ్రా సొసైటీ సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లారు.
దాంతో అక్కడ కారును పార్క్ చేయవద్దని చెప్పమని సెక్రెటరీ రూపేంద్ర యాదవ్ ఆ అపార్టుమెంట్ సెక్యూరిటీ గార్డును ఆదేశించారు. అంతటితో సంతృప్తి చెందని క్షితిజ్ మిశ్రా.. సమస్యను తక్షణమే పరిష్కరించాలని పట్టుబట్టాడు. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆఖరికి క్షితిజ్ మిశ్రా.. రూపేంద్రయాదవ్పై పడి ముక్కు కొరికేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటన జరిగిన వెంటనే రూపేంద్రయాదవ్ కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు క్షితిజ్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. కాగా క్షితిజ్ మిశ్రా.. రూపేంద్ర యాదవ్ ముక్కు కొరికిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
A violent clash at Ratan Planet Apartment, Naramau, over a parking space took a gruesome turn when a resident bit off the nose of the society’s secretary.
An FIR has been lodged, and police are probing the case.#thesentinel #CCTV #FIR pic.twitter.com/EG5pBl60Zr
— The Sentinel (@Sentinel_Assam) May 28, 2025