Visa Free | గుడ్ న్యూస్ చెప్పిన ఫిలిప్పీన్స్.. భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ
Visa Free | స్వదేశంలో తిరగడానికైతే ఏ ఆటంకాలూ ఉండవు. అదే విదేశాలు చుట్టేయాలంటే మాత్రం భారత పాస్పోర్ట్తోపాటు సంబంధిత దేశాల వీసా ఉండాల్సిందే.
Visa Free | స్వదేశంలో తిరగడానికైతే ఏ ఆటంకాలూ ఉండవు. అదే విదేశాలు చుట్టేయాలంటే మాత్రం భారత పాస్పోర్ట్తోపాటు సంబంధిత దేశాల వీసా ఉండాల్సిందే. ఇందుకు ఎన్నో దరఖాస్తులు, ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అందుకే, చాలామంది విదేశాలకు వెళ్లాలంటే జంకుతారు. ఆ కోరిక ఉన్నా.. ఈ తతంగాలన్నీ పూర్తి చేయలేక వెనక్కి తగ్గుతుంటారు. అయితే, వీసాతో పని లేకుండా స్వేచ్ఛగా మా దేశానికి రండని కొన్ని దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి.
ఇండియాకు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులకు వెళ్లేందుకు వీసాతో పని లేదు. భారతీయులకు ప్రత్యేకంగా ఈ దేశాల్లో నిబంధనలేమీ ఉండవు. కొన్ని దేశాలు వీసాకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో తాత్కాలిక వెసులుబాటును కల్పించాయి. మరికొన్ని దేశాలు గడువులు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ పర్యాటకులకు ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్సీన్స్ (Philippines) శుభవార్త చెప్పింది. వీసాలేకుండానే తమ దేశంలోకి భారతీయులు ప్రవేశించవచ్చని తెలిపింది. ఇందుకోసం రెండు రకాల స్వల్పకాలిక వీసా రహిత ప్రవేశ సౌకర్యాలను కల్పిస్తోంది. అయితే, వీటికి వేర్వేరు అర్హతా ప్రమాణాలున్నాయి.
న్యూఢిల్లీలోని ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం..
14 రోజుల వీసా రహిత ఎంట్రీ:
ఈ కేటగిరీ కింద, భారతీయ పౌరులు కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం ఎటువంటి వీసా లేకుండా ఫిలిప్పీన్స్లో 14 రోజుల వరకు బస చేయవచ్చు. అయితే, ఈ వీసా రహిత ప్రవేశాన్ని పొడిగించుకోవడానికి వీలుండదు. అంతేకాదు, దీనిని వేరే రకం వీసాగా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు.
ప్రయాణ ఉద్దేశం పూర్తిగా పర్యాటకానికి మాత్రమే పరిమితం అయి ఉండాలి. ప్రయాణ సమయానికి పాస్పోర్ట్ కనీసం 6 నెలలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. హోటల్ బుకింగ్లు లేదా వసతి నిర్ధారణ పత్రాలు ఉండాలి. పర్యటన ఖర్చులు భరించగలిగే సామర్థ్యం ఉందని కొన్ని రుజువులు చూపించాల్సి ఉంటుంది (ఉదా.. బ్యాంక్ స్టేట్మెంట్లు, ఉద్యోగ ధ్రువీకరణపత్రాలు వంటివి). రిటర్న్ లేదా తదుపరి ప్రయాణ టికెట్ ఉండాలి. గతంలో ఫిలిప్పీన్స్ ఇమ్మిగ్రేషన్ రికార్డు్ల్లో ఎటువంటి ప్రతికూల చరిత్ర ఉండకూడదు.
30 రోజుల వీసా రహిత ఎంట్రీ
నెల రోజుల విధానం ద్వారా అక్కడకు వెళ్లే భారతీయులు 30 రోజుల పాటు వీసా లేకుండా ఫిలిప్పీన్స్లో ఉండే అవకాశం పొందుతారు. అయితే ఇది కేవలం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, కెనడా, సింగపూర్, యూకే వంటి కొన్ని ప్రధాన దేశాల వీసా లేదా శాశ్వత నివాస అనుమతులు కలిగి ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ-వీసా విధానం ప్రకారం.. దరఖాస్తుదారులు evisa.gov.ph వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ కోసం.. చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ (కనీసం ఆరు నెలల వ్యాలిడిటీతో), ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటో, వసతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు (హోటల్ బుకింగ్స్ వంటివి), తిరుగు ప్రయాణ లేదా తదుపరి ప్రయాణ టికెట్, పర్యటన సమయంలో ఖర్చులకు సరిపడే ఆర్థిక ఆధారాలు (బ్యాంక్ స్టేట్మెంట్స్, ఉద్యోగ ధ్రువీకరణ పత్రాలు వంటివి) ఉండాలి. ఈ వివరాలతో దరఖాస్తుదారులు ఆన్లైన్లో సమాచారం నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Also Read..
Visa Interviews | ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు తాత్కాలిక బ్రేక్
Sheikh Hasina | నన్ను కాల్చి చంపి.. గణబంధన్లో పాతిపెట్టండి : రాజీనామాకు ముందు షేక్ హసీనా
Golden Dome | ఆ పని చేస్తే కెనడాకు గోల్డెన్ డోమ్ ఫ్రీ.. డొనాల్డ్ ట్రంప్ ఆఫర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

