Visa Interviews | అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా (across the world) విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను (Visa Interviews) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు వివిధ దేశాల్లోని యూఎస్ ఎంబసీలకు ట్రంప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు దౌత్య విభాగాలు అదనంగా ఎటువంటి వీసా అపాయింట్ మెంట్లను అనుమతించొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను ఆదేశించారు. ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని వెల్లడించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపారు. అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు (Trump govt examines social media vetting) సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థుల వీసాలకు సైతం నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్‌మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకూ వివరాలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగ నిపుణులు విశ్లేషించచనున్నారు. దరఖాస్తుదారుల సోషల్‌మీడియా ఖాతాల పాత పోస్ట్‌లు, వ్యాఖ్యానాలను అధికారులు నిశితంగా గమనించనున్నారు.
Also Read..
Sheikh Hasina | నన్ను కాల్చి చంపి.. గణబంధన్‌లో పాతిపెట్టండి : రాజీనామాకు ముందు షేక్ హసీనా
Golden Dome | ఆ పని చేస్తే కెనడాకు గోల్డెన్ డోమ్ ఫ్రీ.. డొనాల్డ్ ట్రంప్ ఆఫర్
Donald Trump | డొనాల్డ్ ట్రంప్‌కు హార్వర్డ్‌పై కక్ష అందుకేనట.. ఇంటర్నెట్లో జోరుగా ప్రచారం